Moviesబిగ్ షాకింగ్: పింకీ పెళ్లి ఆగిపోయిందా..? సంచలన ప్రకటన చేసిన బిగ్...

బిగ్ షాకింగ్: పింకీ పెళ్లి ఆగిపోయిందా..? సంచలన ప్రకటన చేసిన బిగ్ బాస్ బ్యూటీ..!!

“వాట్ బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్ పెళ్లి ఆగిపోయిందా ..?ఎందుకు.. ఏమైంది..? అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు”. మనకు తెలిసిందే జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన ప్రియాంక సింగ్ ఆ తరువాత ఆ క్రేజ్ తో బిగ్ బాస్ లోకి ఎంటర్ అయింది. బిగ్ బాస్ లో తనదైన స్టైల్ లో ఆడి పాడి అలరించిన ప్రియాంక ..పింకీగా అభిమానులకు దగ్గరైంది. ఆఫ్ కోర్స్ ఇది అందరికీ తెలిసిన విషయమే ..ప్రియాంక సింగ్ ముందు అబ్బాయి తనలోని చేంజెస్ గమనించి ఆ తర్వాత అబ్బాయి నుంచి ఆమెగా మారింది. దీనికి ఏమాత్రం సిగ్గుపడట్లేదు అని షైగా ఫీల్ అవ్వట్లేదని ప్రియాంక సింగ్ బిగ్ బాస్ లోనే చెప్పుకొచ్చింది.

అంతేకాదు బిగ్ బాస్ లో మంచి పేరు సంపాదించుకున్న ప్రియాంక.. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత క్రేజీ ఆఫర్స్ ని పట్టేస్తూ తనదైన స్టైల్ లో ముందుకెళ్తుంది .అందుతున్న సమాచారం ప్రకారం పింకీ ఒక వెబ్ సిరీస్ రెండు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది . గతంలో ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది .అయితే గత కొన్ని రోజుల నుంచి పింకీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .ఆమె హల్దీ ఫంక్షన్ ఫొటోస్ అంటూ.. ఆమె పెళ్లికూతురుని చేస్తున్న ఫొటోస్ అంటూ ..ఆమెకు నిశ్చితార్థం పిక్స్ అంటూ..ఇలా రెడీ అయింది అంటూ ఫొటోస్ తెగ హల్ చల్ చేసాయి.

అయితే ఇప్పటివరకు తన పెళ్లి పై అఫీషియల్ ప్రకటన చేయని పింకీ ..రీసెంట్గా ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించి అసలు విషయం బయట పెట్టింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్..” అవును పింకీ నిజంగానే మీరు పెళ్లి చేసుకోబోతున్నారా..? అని అడగ్గా.. ఆమె నో మీన్స్ నో అంటూ రిప్లై ఇచ్చింది” అంటే పెళ్లి చేసుకునే ఆలోచన లేనట్లే కదా అంటున్నారు జనాలు. కాగా దీంతో ఇప్పటివరకు పింకీ పెళ్లి అంటూ హడావిడి చేసిన సోషల్ మీడియాలో ఇకపై పింకీ పెళ్లి ఆగిపోయిందా,,? అనే వార్తలు వైరల్ గా మారుతాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆమె అభిమానులతో మాట్లాడుతూ ..”లైఫ్ లో ఎప్పుడు ఎవరిపై డిపెండ్ అవ్వకూడదు.. ప్రజెంట్ మనం ఎలా ఉన్నామో అన్నదే ఇంపార్టెంట్.. గతం గురించి ఆలోచించి బాధపడటం ఫ్యూచర్ గురించి ఆలోచించి ఆవేశపడడం మంచిది కాదు.. ప్రజెంట్ మన లైఫ్ లో మనం ఎలా బ్రతుకుతున్నామో అన్నది ఇంపార్టెంట్ ..హ్యాపీగా ఉండడం హెల్త్ కి కూడా ఇంపార్టెంట్ ..”అంటూ చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news