Moviesఈ నగల వెనక ఉన్న ఆ పెద్ద రహస్యం తెలిస్తే షాక్...

ఈ నగల వెనక ఉన్న ఆ పెద్ద రహస్యం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. మణిరత్నంకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా పోనియన్ సెల్వన్.. ఈ సినిమా పేరు మారుమ్రోగిపోతుంది. అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ ఈ సినిమా పై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు జనాలు. మరీ ముఖ్యంగా సినిమాకు సంబంధించిన లుక్, టీజర్,ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాను డైరెక్ట్ చేసింది మణిరత్నం కావడంతో బిగ్ స్టార్స్ కూడా ఈ సినిమా ఖచ్చితంగా ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో భారీ తారగాణం నటిస్తుంది . మల్టీ టాలెంటెడ్ హీరో విక్రమ్, యంగ్ హీరో కార్తీ ,జయం రవి, అందాల భామ ఐశ్వర్యారాయ్ , టాలీవుడ్ హీరోయిన్ త్రిష ..ఇలా బిగ్ స్టార్స్ అందరూ ఈ సినిమాలో నటించడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హీరోయిన్ త్రిష సినిమాకు సంబంధించిన క్రేజీ మ్యాటర్ లీక్ చేసి నెట్టింట ట్రెండింగ్ లోకి వచ్చింది.

మనకు తెలిసిందే పోనియన్ సెల్వన్ సినిమా కధ రాజుల కాలం నాటిది. దీంతో ఈ క్రమంలోనే సినిమా మొత్తం లుక్ అలా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు డైరెక్టర్. హీరోయిన్స్ హీరోస్ కాస్ట్యూమ్స్ కూడా అదే విధంగా ఉంటాయి . కాగా త్రిష మాట్లాడుతూ..” ఈ సినిమాలో తాను చోళా దేశపు రాజకుమారి కుందవై పాత్రలో నటించబోతున్నానని ..కచ్చితంగా నా పాత్ర మీ అందరికీ నచ్చుతుందని ..అలా మణిరత్నం డిజైన్ చేశారని.. కుందవై పాత్ర పట్ల చాలా శ్రద్ధ తీసుకున్నామని మరీ ముఖ్యంగా కాస్ట్యూమ్స్ విషయంలో మణిరత్నం ఎక్కడ రాజీ పడలేదని ..

ఓ టీం ను ప్రత్యేకించి ఏర్పాటు చేసి తమ దుస్తులను నగలను డిజైన్ చేశారని.. అంతే కాదు ఈ సినిమా మొత్తానికి కుందమై పాత్ర లో వేసుకున్న నగలు ఓరిజినల్ వి అని కొన్ని సన్నివేశాలలో నిజమైన నగలే మణీరత్నం తెప్పించారని ఈ సినిమాకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా థాంక్స్..” అంటూ త్రిష చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతుండగా జనాలు ఈ సినిమాపై బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news