Moviesబాల‌య్య బాబునే న‌మ్ముకుంటోన్న అడ‌వి శేష్‌... ఆ సెంటిమెంట్ ఇదే...!

బాల‌య్య బాబునే న‌మ్ముకుంటోన్న అడ‌వి శేష్‌… ఆ సెంటిమెంట్ ఇదే…!

టాలీవుడ్‌లో పెద్ద హీరోల సినిమాల సంద‌డి ముగిసింది. ఇప్పుడు వ‌రుస పెట్టి చిన్న హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ద‌స‌రా నుంచి మ‌ళ్లీ పెద్ద హీరోల సినిమాల రిలీజ్ హ‌డావిడి స్టార్ట్ అవుతుంది. ముందే రిలీజ్ తేదీల‌ను లాక్ చేసుకోక‌పోతే నిర్మాత‌ల‌కు, డిస్టిబ్యూట‌ర్ల‌కు థియేట‌ర్లు దొర‌క‌ని ప‌రిస్థితి. ముందే రిలీజ్ డేట్లు వేసుకున్నా ఆ రోజు మ‌రో హీరో సినిమా రాద‌న్న గ్యారెంటీ కూడా లేదు. ఈ క్ర‌మంలోనే మేజ‌ర్ లాంటి హిట్ సినిమాతో మంచి ఫామ్‌లో ఉన్న యంగ్ హీరో అడ‌వి శేష్ న‌టిస్తోన్న తాజా సినిమా హిట్ 2 : ది సెకండ్ కేస్ కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది.

ఈ సినిమాను డిసెంబ‌ర్ 2న రిలీజ్ చేసేందుకు ఖ‌ర్చీఫ్ వేశారు. ఆ రోజు రిలీజ్ చేస్తున్న‌ట్టు అధికారికంగా కూడా ప్ర‌క‌టించారు. ఈ సినిమా గ‌తంలో హిట్ అయిన హిట్ సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ డేట్ బాల‌య్య‌కు క‌లిసొచ్చిన డేట్‌. గ‌తేడాది డిసెంబ‌ర్ 2న బాల‌య్య – బోయ‌పాటి కాంబోలో వ‌చ్చిన అఖండ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే బాల‌య్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన అఖండ రు. 200 కోట్ల క‌లెక్ష‌న్లు క్రాస్ చేసింది.

దీంతో ఇప్పుడు బాల‌య్య – మ‌లినేని గోపీ కాంబోలో వ‌స్తోన్న బాల‌య్య 107 సినిమాను సైతం అదే రోజు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 2023 సంక్రాంతికి చిరు 154, ప‌వ‌న్ క‌ళ్యాణ్, మ‌హేష్ సినిమాలు రేసులో ఉన్నాయి. పైగా చిరు 154, బాల‌య్య సినిమాలు రెండిటికి మైత్రీ మూవీస్ వాళ్లే నిర్మాత‌లు.. అందుకే బాల‌య్య సినిమాను ముందుగా డిసెంబ‌ర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు బాల‌య్య హిట్ సెంటిమెంట్ డేట్‌పై అడ‌వి శేష్ క‌న్నేశాడు.

పైగా హిట్ సినిమాకు నేచుర‌ల్ స్టార్ నాని నిర్మాత‌. ఫ‌స్ట్ పార్ట్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన శైలేష్ కొలనే రెండో భాగానికీ దర్శకుడు. మ‌రి బాల‌య్య‌కు క‌లిసొచ్చిన ఈ డేట్‌కే హిట్ వ‌స్తుందా ? బాల‌య్య సెంటిమెంట్ అటు నిర్మాత‌గా నానికి, అడ‌వి శేష్‌కు క‌లిసి వ‌స్తుందా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news