Movies' గాడ్ ఫాథ‌ర్ ' సెన్సార్ కంప్లీట్‌... ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది...!

‘ గాడ్ ఫాథ‌ర్ ‘ సెన్సార్ కంప్లీట్‌… ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది…!

టాలీవుడ్ లెజెండ్రీ హీరో మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ పొలిటికల్ డ్రామా గాడ్ ఫాథ‌ర్. మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమాకు మోహనరాజా దర్శకుడు. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించింది. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగల్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సినిమా రిలీజ్ డేట్ ఇచ్చినా ఇప్పటివరకు ప్రమోషన్లు స్టార్ట్ చేయకపోవడంతో మెగా అభిమానులు కూడా నిరుత్సాహంతో ఉన్నారు.

తాజాగా గాడ్ ఫాథ‌ర్ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి u/a సర్టిఫికెట్ వచ్చింది. ఈ విషయాన్ని దర్శకుడు మోహనరాజా తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినట్టు తెలిసింది. సినిమా పొలిటికల్ డ్రామాగా చాలా బాగుందని… మెగాస్టార్ తన నటనతో అదరగొట్టేసాడని సెన్సార్ బోర్డు సభ్యులు ప్రశంసలు కురిపించారట.

ఇక ద‌ర్శ‌కుడు మోహనరాజా ఇదే విషయం చెబుతూ తాను ఆడియన్స్ రెస్పాన్స్ కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఏదేమైనా సినిమాకు పాజిటివ్ బజ్‌ రావడంతో సినిమా మేకర్స్ అందరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అక్టోబర్ 5 న నాగార్జున ది ఘోస్ట్ సినిమాకు పోటీగా గాడ్ ఫాథ‌ర్ రిలీజ్ అవుతుంది. విచిత్రం ఏంటంటే అదే రోజు మంచి విష్ణు జిన్నా సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news