Moviesలెట్స్ బ్రేకప్: ఆ విషయంలో రష్మిక..విజయ దేవరకొండను హర్ట్ చేసిందా..?

లెట్స్ బ్రేకప్: ఆ విషయంలో రష్మిక..విజయ దేవరకొండను హర్ట్ చేసిందా..?

ఎస్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందనకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య మ్యాటర్ చెడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే హీరోయిన్ రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి రెండు సినిమాలు చేశారు. దీంతో ఒక సినిమా బ్లాక్ బస్టర్హిట్ అవ్వగా..రెండో సినిమా పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకోలేక పోయింది. అయితే తెర పై వీళ్ల రొమాన్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యింది. దీంతో విజయ్ దేవరకొండ రష్మిక ల మధ్య మ్యాటర్ సినిమాలు కాదు ఇంకా ఏదో ఉంది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది.

దానికి తగ్గట్టే విజయ్ దేవరకొండ ఎక్కడ ఉంటే అక్కడ రష్మిక మందన ప్రత్యక్షమవడం ..రష్మిక విజయ్ దేవరకొండ ముంబైలో డిన్నర్ డేట్స్ అంటూ పార్టీలు అంటూ పబ్లిక్ గా మీడియా కంటపడడంతో వీళ్లిద్దరు లవ్ మేటర్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది . అంతేకాదు కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ రష్మిక కు పబ్లిక్ గానే ఐ లవ్ యు చెప్పేసాడు. దీంతో రష్మిక విజయ్ లవ్ చేసుకుంటున్నారు అంటూ కన్ఫర్మ్ చేసుకున్నారు జనాలు . అయితే రీసెంట్ గా వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ లైగర్ మూవీ ఎలాంటి టాక్ సంపాదించుకుందో తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన న్యూడ్ పోస్ట్ర్ ని రిలీజ్ చేసినప్పుడు రష్మిక మందన్న, సమంత, పూజ హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ , జాన్వి కపూర్ అందరు కూడా హాట్ కామెంట్స్ చేశారు . కానీ సినిమా ఫ్లాప్ అయ్యాక ఒక్కరంటే ఒక్క హీరోయిన్ కూడా ఆయనకి సపోర్టుగా నిలవలేదు .

ఎవరు ఎలా ఉన్నా కానీ రష్మిక మందన సపోర్టుగా ఉంటుంది అని అనుకున్నా విజయ్ దేవరకొండకు చేదు అనుభవం ఎదురయిందట. లైగర్ సినిమా ఫ్లాప్ అయినప్పటి నుంచి రష్మిక మందన విజయ్ కాల్ రెస్పాండ్ అవ్వట్లేదట ..మెసేజెస్ కి రిప్లై ఇవ్వట్లేదట.. రష్మిక, విజయ్ నెంబర్లు బ్లాక్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నట్లు బాలీవుడ్ మీడియా కోడైకూస్తుంది. మరి చూడాలి దీనిపై రష్మిక కానీ విజయ్ దేవరకొండ కానీ ఏ విధంగా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news