Moviesఓ మై గాడ్: నిఖిల్ అనుకుని నితిన్ ని పిలిచారా..? ఇదేం...

ఓ మై గాడ్: నిఖిల్ అనుకుని నితిన్ ని పిలిచారా..? ఇదేం షాకింగ్ ట్విస్ట్ రా బాబు..!!

యస్ ఇప్పుడు అందరు ఇదే మాట అంటున్నారు. మనకు తెలిసిందే రీసెంట్ గా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ భేటీ అయ్యారు అంటూ వార్తలు వినిపించాయి. నిజానికి అంతకుముందే అమిత్ షా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు . ఆ ఒక్క మీటింగ్ తోనే సినీ ఇండస్ట్రీలో రాజకీయ ప్రకంపనులు సృష్టించిన బిజెపి ఆ తరువాత యంగ్ హీరో నితిన్ కలవడం కూడా మరోసారి కొత్త అధ్యాయానికి తెరలేపిన్నట్లైంది.

అయితే దీనిపై యంగ్ హీరో నితిన్ ఏ విధంగా స్పందించలేదు . కాగా దీనికి సంబంధించి మరోసారి కొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే నిజానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీట్ అవాలి అనుకున్నింది యంగ్ హీరో నితిన్ ని కాదట . ఎస్ ఇప్పుడు ఇదే వార్త సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఆయన మీట్ అవ్వాలనుకున్నింది రీసెంట్ గా కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నిఖిల్ నట. ఆయన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్నాడు .

పైగా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇలాంటి హిట్ సాధించడంతో సామాన్య ప్రజలు కూడా ఆయన ఓ రేంజ్ లో మెచ్చుకుంటున్నారు. దీంతో ఆయన తమ పార్టీ తరపున ప్రచారం చేస్తే రానున్న రోజుల్లో పార్టీకి మరింత ప్లస్ అవుతుందని బిజెపి వాళ్లు భావించారట. కానీ పేరుని సరిగ్గా వినకపోవడంతో నిఖిల్ ని కాస్త నితిన్ ని చేసేసి ఆయనను కలిశారట. కాగా అసలే మాచర్ల నియోజకవర్గం ఫ్లాప్ తో అల్లాడిపోతున్న నితిన్ కు ఇది భారీ అవమానం అనే చెప్పాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news