Moviesఅనుపమ అన్ బిలీవబుల్ డెసీషన్..షాక్ అవుతున్న సినీ పెద్దలు..!?

అనుపమ అన్ బిలీవబుల్ డెసీషన్..షాక్ అవుతున్న సినీ పెద్దలు..!?

అనుపమ పరమేశ్వరన్.. పేరుకు మలయాళ బ్యూటీ అయిన చూడటానికి అచ్చం తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో వచ్చిన “అ ఆ” అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంటర్ అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమా స్టోరీలను చూస్ చేసుకుంటూ అభిమానులను మెప్పించింది. అంతేకాదు అనుపమలో అందరికీ నచ్చే మెయిన్ విషయం నాచురల్ యాక్టింగ్. అందరిలా తాను క్యారెక్టర్ లో లీనం అయిపోయి నటించదు.. క్యారెక్టర్ ని అర్థం చేసుకొని దానికి తగ్గట్లు నటించి జనాలను మెప్పిస్తుంది.

 

ఇప్పటివరకు అనుపమ పరమేశ్వరణ్ చేసిన సినిమాలు అన్నీ చూస్తే ఆ విషయం మనకు బాగా క్లియర్ గా అర్థమవుతుంది. అంతేకాదు రీసెంట్ గా అనుపమ పరమేశ్వరన్ కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు ఫస్ట్ టైం ఆమె నటించిన సినిమా 100 కోట్లు క్రాస్ చేసి సెన్సేషనల్ రికార్డును సొంతం చేసుకుంది అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమాలో అనుపమ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలతో ముంచెత్తారు.

కాగా, ఈ సినిమా హిట్టుతో అనుపమకు బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే అనుపమ మాత్రం బాలీవుడ్ సినిమాలో చేయకూడదని నిర్ణయించుకుందట. అంతేకాదు సౌత్ హీరోయిన్స్ ని నార్త్ లో చాలా చులకనగా చూస్తారని.. సౌత్ లో ఉన్నప్పుడు ఆ క్రేజ్ కోసం నార్త్ కి తీసుకెళ్తారని.. ఒక్క సినిమా కాని అక్కడ ఫ్లాప్ అయితే ఐటమ్ గర్ల్ గా చూస్తారంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసిందట . అందుకే తన వద్దకు వస్తున్న బాలీవుడ్ సినిమాలన్నీ రిజెక్ట్ చేసేస్తుందట . దీంతో సినీ పెద్దలు కూడా షాక్ అవుతున్నారు . బాలీవుడ్ అవకాశం వస్తే ఏ హీరోయిన్ వదులుకోదు . కానీ అనుపమ గట్స్ తో తాన టాలెంట్ ని నమ్ముకుని ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో అనుపమ పేరు ఫిలిం ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది.

Latest news