Movies' అల్లూరి ' కి ఫ‌స్ట్ రోజే ఎదురు దెబ్బ‌... షాక్‌లో...

‘ అల్లూరి ‘ కి ఫ‌స్ట్ రోజే ఎదురు దెబ్బ‌… షాక్‌లో హీరో శ్రీ విష్ణు ఏం చేశాడంటే…!

యంగ్ హీరో శ్రీ విష్ణు – క‌య‌దు లోహార్ జంటగా తెర‌కెక్కిన సినిమా అల్లూరి. కొత్త దర్శకుడు ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బెక్కం వేణుగోపాల్ నిర్మించారు. ఈరోజు నాగశౌర్య కృష్ణ వ్రింద విహారి సినిమాకు పోటీగా రిలీజ్ అయింది. ఇద్ద‌రు యంగ్ హీరోల సినిమాలు ఒకే రోజు రావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. పైగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ సినిమా ప్ర‌మోష‌న్‌కు రావ‌డంతో మంచి బ‌జ్ కూడా వ‌చ్చేసింది.

అయితే ఫైనాన్షియల్ కారణాలతో ఈ సినిమాకు తొలిరోజే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ, తెలంగాణలో అల్లూరి సినిమా మార్నింగ్ షోలు రద్దు చేశారు. ఈ సినిమా నిర్మాతకు ముందు సినిమాల‌తో ఆర్థిక లావాదేవీలు ఉండడంతో డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఈ సినిమా మార్నింగ్ షోలు క్యాన్సిల్ చేశారు. అయితే హీరో శ్రీ విష్ణు స్వయంగా రంగంలోకి దిగి వీటిని సెటిల్ చేసేందుకు తన వంతుగా ప్రయత్నాలు చేశారు.

ఎట్టకేలకు మ్యాట్నీ నుంచి ఈ సినిమా షోలు ప్రారంభమయ్యాయి. దీనిపై శ్రీ విష్ణు స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కొన్ని కారణాలవల్ల అల్లూరి మార్నింగ్ షోలు మీ ముందుకు తీసుకురాలేకపోయాము.. మ్యాట్నీ నుంచి ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది అని ఆయన ట్విట్ చేశారు. ఇక అల్లూరి మార్నింగ్ షోలు రద్దు కావడంతో పలువురు సినీ ప్రియుల‌తో పాటు శ్రీ విష్ణు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాకు మంచి బజ్ ఉందని.. తాము మార్నింగ్ షోకు టికెట్లు బుక్ చేసుకున్నామని అయితే మార్నింగ్ షో లు క్యాన్సిల్ కావడంతో తాము తీవ్ర నిరాశకు గురయ్యామని వారంతా సోషల్ మీడియా వేదికగా తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కిన అల్లూరి సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీ విష్ణు పోలీస్ అధికారి పాత్రలో నటించాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news