Moviesఅమల చేతిలో ఆ యంగ్ హీరో భ‌విష్య‌త్తు... ముంచినా... తేల్చినా...!

అమల చేతిలో ఆ యంగ్ హీరో భ‌విష్య‌త్తు… ముంచినా… తేల్చినా…!

యంగ్ హీరో శర్వానంద్‌ను అక్కినేని అమల అయినా కాపాడి హిట్ వచ్చేలా చేస్తుందా..! అని ఇప్పుడు నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్‌లో టాలెంటెడ్ హీరోగా శర్వానంద్ మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. తన కోసం మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ కూడా శర్వానంద్‌తో శతమానంభవతి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించాడు. శర్వాతో సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ అని నమ్మకం కలిగింది.

అయితే, శర్వానంద్ కి శతమానం భవతి సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు హిట్ దక్కలేదు. మధ్యలో పడిపడి లేచేమనసు, రణరంగం, మహా సముద్రం, శ్రీకారం, ఆడవాళ్ళు మీకు జోహార్లు, జాను లాంటి సినిమాలు వచ్చి వరుసగా ఫ్లాపయ్యాయి. దాంతో శర్వా మార్కెట్ కూడా బాగా పడిపోయింది. ఇలాంటి సమయంలో ఒక్క హిట్ అయినా కావాలి. ప్రస్తుతం శర్వానంద్ నటించే ఒకే ఒక జీవితం అనే సినిమా చేస్తున్నాడు. సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

అయితే, గతకొంతకాలంగా శర్వానంద్‌కి హిట్స్ లేకపోవడంతో ఇప్పుడు చేస్తున్న ఒకే ఒక జీవితం సినిమా మీదే చాలా ఆశలు పెట్టుకున్నాడు. దీనికి కారణం ఇందులో అక్కినేని అమల కీలక పాత్రను పోషిస్తుండటం. అమల చాలా కాలంగా సినిమాలు చేయడం లేదు అనే సంగతి తెలిసిందే. పట్టుపట్టి దర్శకుడు శేఖర్ కమ్ముల ఆయన తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కీలక పాత్రను చేసేలా ఒప్పించారు. కానీ, ఈ పాత్ర నాగార్జునకి ఎంతమాత్రం నచ్చలేదు.

ఇలాంటి పాత్రను ఇంకెప్పుడూ చేయవద్దని నాగార్జున అమలకి తెగేసి చెపారు. అయితే, అమల ఓ పాత్ర చేస్తుందీ అంటే ఖచ్చితంగా ఆ సినిమా కథ చాలా బలంగా ఉంటుందని చెప్పొచ్చు. లేకపోతే అంత సులభంగా అమల ఒప్పుకోదు. ఖచ్చితంగా కథ, కథనాలు అద్భుతంగా ఉన్నాయనే ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అమ‌ల కూడా తాను చేసిన ఈ పాత్ర ఎంతో బాగుంద‌ని.. త‌న‌కు సంతృప్తి ఇచ్చింద‌ని చెపుతోంది.

దీనినిబట్టి చూస్తే శర్వానంద్‌కి అమల ఒకే ఒక జీవితం సినిమాతో హిట్ వచ్చేలా సహాయపడుతుందని. చూడాలి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అమ‌ల శ‌ర్వానంద్‌ను ముంచుతుందో ? తేల్చుతుందో ? మరి ఈ సినిమా ఎంతవరకు శర్వాని బయటపడేస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news