Moviesనయన్ ను నాకంటే ముందే ముద్దు పెట్టుకున్నాడు..విగ్నెశ్ శివన్ సంచలన పోస్ట్...

నయన్ ను నాకంటే ముందే ముద్దు పెట్టుకున్నాడు..విగ్నెశ్ శివన్ సంచలన పోస్ట్ వైరల్..!

కోలీవుడ్ కొత్త జంట నయన్ విగ్నేశ్ ఇప్పుడు స్పెయిన్ లో హనీమూన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఈ మధ్యనే తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్ లో గ్రాండ్ గా వెడ్డింగ్ చేసుకున్నారు. అబ్బో, వీళ్ల పెళ్లి తంతు భలే విచిత్రంగా జరిగిందిలేండి. ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్న ఇద్దరు..వాళ్ళే తమ ఫోటోలని అభిమానులకి షేర్ చేసారు. పెళ్లికి ముందు ఎన్ని ఎఫైర్లు నడిపినా..

పెళ్లి తరువాత మాత్రం పతియే ప్రత్యేక్ష దైవం..అంటూ బీహేవ్ చేస్తుంది నయన్. భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ ,,భర్త చెప్పిన దానికి నో అనకుండా తల ఊపుతూ..భర్త తో ఎంజాయ్ చేస్తుంది. పెళ్లి తరువాత ఓ సారి ధాయ్ ల్యాండ్ లో హనీమూన్ జరుపుకున్న ఈ జంట..మళ్లీ టైం దొరకడం తో రెండో రౌండ్ హనీమూన్ కి వెళ్లారు. స్పెయిన్ లో ఈ జంట సందడి చేస్తుంది. అక్కడ రోడు పై, షాపింగ్ మాల్స్ లో నయన్ చెయ్యి వదలటం లేదు కొత్త భర్త విగ్నేశ్.

తాజాగా అక్కడి బ్యూటిఫుల్ మూమెంట్స్ ని అభిమానులతో పంచుకున్నాడు. దాని ఓ పోస్ట్ కూడా పెట్టాడండోయ్. విగ్నేశ్ పోస్ట్ చేస్తూ..” ఇందులో ఏ ఫిల్టర్‌ లేదు వాడలేదు.. నాచురల్ గానే ఇలా మెరుస్తోంది నా భర్య.. అలా సూర్యరశ్మీ ఓ పెయింటింగ్ మీద పడి ఆ నీడ ఇలా నా నయన్‌ను ముద్దు పెట్టుకుంది. నేను ముద్దుపెట్టుకునేలోపే నా భార్యను ముద్దుపెట్టుకునేసింది. ఈ ఫీల్ చాలా బాగుంది. ఈ లైట్, ఈ మూడ్.. ఈ ప్లేస్ అన్నీ మాకు కొత్త అనుభూతి ఇస్తున్నాయి..కొత్త అనుభవాలుగా మిగిలిపోనున్నాయి.. అందుకే ఇందులో కొన్ని ఫోటోలను మీకు షేర్ చేస్తున్నాను” ..అంటూ ఓ పోస్ట్ చేసుకొచ్చాడు విఘ్నేశ్ శివన్ .

 

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news