Moviesఈ హాట్ హీరోయిన్‌కు క‌నీసం ఐటెం సాంగ్స్ కూడా లేకుండా చేసిన...

ఈ హాట్ హీరోయిన్‌కు క‌నీసం ఐటెం సాంగ్స్ కూడా లేకుండా చేసిన సీనియ‌ర్ హీరో…!

రవితేజ సరసన నటించి ఐటెం సాంగ్స్ చేసే ఛాన్స్ కూడా పోగొట్టుంది డింపుల్ హయాతి అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2017లో సునీల్ కుమార్ దర్శకుడిగా తెరకెక్కించిన గల్ఫ్ అనే సినిమాతో డింపుల్ హయాతి హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇది కమర్షియల్ మూవీ కాకపోవడంతో ఇక్కడ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత దేవి 2 మూవీ ద్వారా కోలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇది ఒక మాదిరిగా అమ్మడికి పేరు తెచ్చింది.

2019లో అభినేత్రి 2లో కీలక పాత్రను పోషించింది. అయితే, తెలుగులో బాగా పేరు తెచ్చిపెట్టింది మాత్రం మెగా ప్రిన్స్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన గద్దలకొండ గణేష్ మూవీ. ఇందులో పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్స్‌గా నటించారు. వీరిద్దరికంటే ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది మాత్రం సూపర్ హిట్టూ నీ హైటూ అనే పాటతో డింపుల్ కే. ఈ పాటతో బాగా హైలెట్ అయింది.

అలా ఐటెం సాంగ్స్ చేసుకున్నా డింపుల్ కాస్త క్రేజ్‌తో వెలుగుతుండేమో. అనసవసరంగా అటు తమిళంలో విశాల్ సినిమా, ఇటు తెలుగులో రవితేజ సినిమా ఒప్పుకొని దెబ్బైపోయింది. భారీ ఎద అందాలు ప్రదర్శిస్తూ చేసిన ఘాటు పర్ఫార్మెన్స్ మొత్తం వేస్ట్ అయిపోయింది. ఖిలాడి సినిమా వల్ల రవితేజ తనకి మంచి బ్రేక్ ఇస్తాడనుకుంది డింపుల్. అలాగే, విషాల్ విశయంలోనూ భావించింది. కానీ, ఈ ఇద్దరు హీరోలు డింపుల్‌కి సక్సెస్ ఇవ్వలేకపోయారు.

పెద్దగా గాప్ లేకుండా వచ్చిన రవితేజ, విశాల్ సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి. ఈ రెండు సినిమాలలో హీరోయిన్‌గా నటించిన డింపుల్ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఎక్స్‌ఫోజింగ్ ఎంత చేయమన్నా చేయడానికి రెడీగా ఉన్న డింపుల్‌కి కనీసం ఇప్పుడు ఐటెం సాంగ్స్ కూడా రావడం లేదంటున్నారు. చూడాలి మరి ఇప్పుడు తెలుగులో శ్రీవాస్ డైరెక్టర్‌గా తెరకెక్కుతున్న సినిమా ఒకటి ఉంది. అది ఏమేరకు హిట్ ఇస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news