Newsశింబు అఫైర్లు న‌డిపిన హీరోయిన్ల లిస్ట్ పెద్ద‌దే... కెరీర్‌ను దెబ్బ కొట్టింది...

శింబు అఫైర్లు న‌డిపిన హీరోయిన్ల లిస్ట్ పెద్ద‌దే… కెరీర్‌ను దెబ్బ కొట్టింది ఆ ఇద్ద‌రే…!

సినిమా ఇండ‌స్ట్రీలో టాలెంట్ తో పాటూ క్ర‌మ‌శిక్ష‌ణ కూడా తోడైతో ఆపేవాళ్లు ఉండ‌రు. మంచి క‌థ‌లు ప‌డితే స్టార్ హీరోలుగా ఎదిగిపోతారు. అందుకు ఎన్టీఆర్, చిరంజీవి, రజ‌నీకాంత్ లాంటి హీరోల‌నే ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు. కానీ క్ర‌మ‌శిక్ష‌ణ లేక‌పోతే మాత్రం స్టార్స్ ఫ్యామిలీ నుండి వ‌చ్చినా స‌క్సెస్ అవ్వ‌లేరు. అలా క్ర‌మ‌శిక్ష‌ణ లేక‌పోవ‌డం హీరోయిన్ల‌తో అఫైర్ ల వ‌ల్ల‌నే శింబు స్టార్ హీరో అవ్వ‌లేక‌పోయాడ‌ని విశ్లేష‌కులు అభిప్రాయప‌డుతుంటారు. ఇది నిజం కూడా..!

కెరీర్ ప్రారంభంలో స‌క్సెస్ అయినా చాలా మంది హీరోయిన్ల‌తో శింభుకు ఉన్న సంబంధాలే అత‌డి కెరీర్ ను దెబ్బ‌కొట్టాయ‌ని చెబుతుంటారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ శింబు ప్రేమాయ‌ణాలు న‌డిపిన హీరోయిన్ ల లిస్ట్ పై ఓ లుక్కేద్దాం…

న‌య‌న‌తార :
కెరీర్ ఆరంభంలో శింబు హీరోయిన్ న‌య‌న‌తారతో గాఢ‌మైన ప్రేమ‌లో మునిగి తేలాడు. వీరిద్ద‌రి ప‌ర్స‌న‌ల్ ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఏం జ‌రిగిందో తెలీదు కానీ ఇద్ద‌రూ విడిపోయారు. వీరిద్ద‌రు క‌లిసి వ‌ల్ల‌భ సినిమాలో న‌టించారు. ఈ సినిమాలో వీరిద్ద‌రి మ‌ధ్య సీన్లు మ‌రీ హ‌ద్దుమీరిపోయి ఉంటాయి. న‌య‌న‌తార కోస‌మే ఈ సినిమాను శింబు ఏకంగా యేడాది పాటు సాగ‌దీస్తూ డైరెక్ష‌న్ చేశాడు. ఇక వీరు తర‌వాత భ‌ద్ద శ‌త్రువులుగా మారిపోయారు. ఆ త‌ర‌వాత‌నే న‌య‌న‌తార ప్ర‌భుదేవాతో ప్రేమ‌లో ప‌డింది.

హ‌న్సిక :
దేశ‌ముదురు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆపిల్ బ్యూటీ హ‌న్సిక‌తోనూ శింబు సుధీర్గ కాలం పాటూ ప్రేమాయ‌ణం న‌డిపించాడు. వీరిద్ద‌రు క‌లిసి కొన్ని సినిమాల్లో కూడా న‌టించారు. ఆ టైంలో హ‌న్సిక లేకుండా శింబు ఒక్క క్ష‌ణం కూడా ఉండేవాడు కాదు. హ‌న్సిక షూటింగ్‌లో విదేశాల్లో ఉంటే అక్క‌డ‌కు కూడా శింబు వెళ్లిపోయేవాడు. చాలా కాలం పాటూ డేటింగ్ లో ఉన్న వీళ్లు పెళ్లి వ‌రకూ వెళ్లి ఆ త‌ర‌వాత బ్రేక‌ప్ చెప్పుకున్నారు. ఆ త‌ర్వాత కూడా వీరు స్నేహితులుగానే ఉన్నారు.

త్రిష :
శింబు త్రిష క‌లిసి త‌మిళ్ లో ఏమ‌య చేశావే ఒరిజిన‌ల్ లో న‌టించారు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. కాగా శింబు – త్రిష‌లు ఈ సినిమా షూటింగ్ స‌మయంలో ప్రేమ‌లో ప‌డ్డారు. ఆ త‌ర‌వాత చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. చివ‌రికి ఏం జ‌రిగిందో కానీ ఎవ‌రి దారి వాళ్లు చూసుకున్నారు.

సుబీక్ష :
త‌మిళ హీరోయిన్ సుబీక్ష తో శింబు ప్రేమ‌లో ఉన్నాడ‌ని గ‌త కొద్దిరోజులుగా కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్ద‌రి ప‌ర్స‌న‌ల్ ఫోటోలు నెట్టింట చ‌క్క‌ర్లు కొట్ట‌డంతో ఆ వార్త‌ల‌కు కూడా బ‌లం చేకూరింది.ఆండ్రియా :
సింగ‌ర్, హీరోయిన్ ఆండ్రియాతో కూడా శింబు ప్రేమాయ‌ణం నడిపించాడ‌ని కోలీవుడ్ లో టాక్ ఉంది. సుచీలీక్స్ లో సైతం ఆండ్రియా పేరు మ‌రియు ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అంతే కాకుండా ఆండ్రియా శింబుకు చాలా క్లోజ్ అని ఇద్ద‌రూ డేటింగ్ లో ఉన్నార‌ని వార్త‌లు చ‌క్కర్లు కొట్టాయి. శింబు ఎంత‌మంది హీరోయిన్ల‌తో ప్రేమాయ‌ణాలు న‌డిపినా న‌య‌న‌తార‌, హ‌న్సిక‌తో అత‌డి ప్రేమ వల్లే కెరీర్ గ్రాఫ్ డౌన్ అయిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news