Moviesఎన్టీఆర్ హిట్ సినిమా రీమేక్‌ కోరిక‌ను అలా తీర్చుకున్న బాల‌కృష్ణ‌...!

ఎన్టీఆర్ హిట్ సినిమా రీమేక్‌ కోరిక‌ను అలా తీర్చుకున్న బాల‌కృష్ణ‌…!

నటరత్న ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ పౌరాణికం- సాంఘికం- భక్తి- జానపదం ఇలా ఏ సినిమాలో నటించిన కూడా ప్రేక్షకులను మెప్పించారు. ఎన్టీఆర్ కెరియర్ ఆరంభంలోనే పాతాళభైరవి లాంటి జానపద సినిమాలో నటించారు. 1951లో వ‌చ్చిన‌ ఈ సినిమా కె.వి.రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుతుంది. ఎన్టీఆర్ చిన్న వయసులోనే చూపించిన ప్రతిభ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాలో కే. మాలతి సావిత్రి- గిరిజ- సురభి కమలాబాయి లాంటి నటిమణులు కూడా నటించారు.

తోటరాముడిగా ఎన్టీఆర్ చేసిన సాహస కార్యాలు, బేతాళ మాంత్రికుడుగా ఎస్వీ రంగారావు నటన అప్పట్లో సినిమాకు హైలైట్ అయ్యాయి, 1952లో భారతదేశంలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిథ్యం వహించిన ఏకైక సినిమా పాతాళభైరవి. పాతాళభైరవి సినిమా బాలయ్యకు బాగా ఇష్టమైన సినిమా. ఎప్పటికైనా ఈ సినిమా రీమేక్‌లో నటించాలన్న కోరిక బాలయ్యకు విపరీతంగా ఉండేది.

ఆదిత్య 369 హిట్ అయ్యాక అదే సంగీతం శ్రీనివాసరావుకు పాతాళ భైరవి రీమేక్ అప్పగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా బాలయ్య చేశాడు. అయితే పాతాళ భైరవి రీమేక్ కాకపోయినా అదే తరహా జానపద సినిమాలో నటించాలన్న బాలయ్య కోరిక భైరవద్వీపం సినిమాతో తీరిపోయింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1994లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. చందమామ విజయ కంబైన్స్ బ్యానర్ పై బి. వెంకట్రామిరెడ్డి ఈ సినిమా నిర్మించారు.

రావి కొండలరావు కథ‌, మాటలు అందించారు. బాలయ్యకు జోడిగా రోజా నటించ‌గా… రంభ ప్రత్యేకగీతంలో నటించారు. ఆ ఏడాది మూడో ఉత్తమ నంది పురస్కారం అవార్డు భైరవద్వీపం అందుకుంది. విజయా సంస్థలో అంతకుముందు సింగీతం శ్రీనివాసరావు బృందావనం సినిమా తీసి సూపర్ హిట్ కొట్టారు. ఇక రావి కొండలరావు అందించిన జానపద కథకు మళ్ళీ ఆయన దర్శకుడు అయితేనే బాగుంటుందని విజయా సంస్థ భావించింది.

ఇక ఈ సినిమా కథపై కూడా పాతాళ భైరవి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. రావి కొండలరావు కూడా పాతాళభైరవి స్ఫూర్తితోనే భైరవద్వీపం కథను కూడా అల్లుకున్నారు. బాలయ్య కథ విన్న వెంటనే తన తండ్రి నటించిన పాతాళభైరవి తరహాలోనే ఉందని… తన కోరిక ఇన్నాళ్లకు నెరవేరుతుందని వెంటనే ఒప్పుకున్నారు. అలా బాలయ్య తాను తండ్రి స్టైల్లోనే పౌరాణికం సాంఘికం, భక్తి రస చిత్రాలతో పాటు జానపద కథలకు కూడా కరెక్ట్ గా సూట్ అవుతానని ఈ సినిమాతో నిరూపించుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news