Moviesసురేఖ‌వాణి రెండో పెళ్లి ఫిక్స్‌... కూతురు సుప్రీత ఇచ్చిన హింట్ ఇచ్చేసిందిగా...!

సురేఖ‌వాణి రెండో పెళ్లి ఫిక్స్‌… కూతురు సుప్రీత ఇచ్చిన హింట్ ఇచ్చేసిందిగా…!

తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రముఖ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సురేఖవాణి గత రెండు దశాబ్దాలుగా తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అక్క, వదిన పాత్రలతో బాగా పాపులర్ అయింది. ఇక కొన్నేళ్ల క్రితం సురేఖవాణి భర్త గుండెపోటుతో హఠాన్మరణం పాలైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి సురేఖవాణి తన కుమార్తె సుప్రీత‌తో కలిసి చేసే అల్లరితో సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతూ వస్తోంది.

కరోనా సమయంలో కూడా సురేఖ వాణి సుప్రీతతో కలిసి టిక్ టాక్ వీడియోలు చేయడంతో పాటు చాలా హాట్ హాట్ కుర‌చ దుస్తులతో కనిపిస్తూ డ్యాన్సులు చేస్తూ బాగా పాపులర్ అయింది. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లకు కూడా లేనంత పాపులారిటీ సురేఖవాణికి ఆమె కుమార్తె సుప్రీతకు ఉంది. ఈ వయసులో కూడా సురేఖ వాణి కూతురుతో సమానంగా ఎనర్జిటిక్ డాన్సులు వేస్తూ అందాలను ఆరబోస్తూ ఉంటుంది. అటు కుమార్తె సుప్రీత కూడా కుర‌చ‌ దుస్తులతో హాట్ హాట్‌గా దర్శనమిస్తూ తనలో హీరోయిన్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని చూపించుకుంటూ ఉంటుంది.

ఇక కొద్ది రోజుల నుంచి సురేఖ తన కుమార్తె సుప్రీతను హీరోయిన్ చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుందని… టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో ఆమెను నటింపజేసేందుకు తనకున్న పరిచయాలతో ప్రయత్నాలు చేస్తుందన్న గుసగుసలు కూడా వినిపించాయి. తాజాగా సురేఖవాణి సుప్రీతలను యూట్యూబ‌ర్ నిఖిల్‌ ఇంటర్వ్యూ చేయడంతో పాటు వారి వ్యక్తిగత విషయాలను కూడా రాబట్టేందుకు ప్రయత్నించాడు. నిఖిల్ అడిగిన పలు ప్రశ్నలకు ఆ ఇద్దరు నవ్వుతూనే ఆన్సర్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే సురేఖవాణితో మీరు మళ్ళీ ఎప్పుడు ? పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ నిఖిల్ ప్రశ్నించగా… సురేఖవాణి మాత్రం నో అన్న బోర్డు చూపించింది. అయితే కుమార్తె సుప్రీత్ మాత్రం ఎస్ అన్న‌ బోర్డు చూపించడంతో ఇప్పుడు సురేఖ వాణి రెండో పెళ్లి గురించి మళ్లీ గుసగుసలు వినిపిస్తున్నాయి.
సుప్రీత ఎస్ అన్న బోర్డు చూపించడంతో పాటు నా బుర్ర తింటూ ఉంటుంది.. సింగిల్ గా ఎలా ? ఉంటుంది.. చేసేద్దాం అని చెప్పింది.

ఇక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటూ సుప్రీతను ప్రశ్నించగా తనను భరించే బాయ్ ఫ్రెండ్ ఉండాలని చెప్పగా… సురేఖ మాత్రం తనకు 6 ఫీట్ హైట్ ఉన్న బాయ్ ఫ్రెండ్ కావాలని చెప్పింది. మంచి కలర్ తో పాటు బాగా డబ్బు ఉండాలని… తనను బాగా చూసుకోవాలని… లైట్‌గా గడ్డం ఉండాలంటూ.. తనకు కాబోయే భాయ్‌ఫ్రెండ్ క్వాలిటీస్ గురించి వెల్లడించింది. ఏదేమైనా సురేఖ పెళ్లి గురించి కుమార్తె ఇచ్చిన హింట్‌తో సురేఖ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుందా ? అన్న చర్చలు అయితే స్టార్ట్ అయ్యాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news