Movies"ఐ హేట్ యూ దుల్కర్ సల్మాన్"..నెట్టింట వైరల్ గా మారిన లెటర్..!

“ఐ హేట్ యూ దుల్కర్ సల్మాన్”..నెట్టింట వైరల్ గా మారిన లెటర్..!

దుల్కర్ సల్మాన్..ఒకప్పుడు అంటే ఈ పేరుకి పరిచయాలు అవసరం కానీ, ఇప్పుడు అలాంటి అవసరం లేదు. మహానటి సినిమా ద్వార తెలుగులో కూడా బాగా పాపులర్ అయ్యాడు. ఆ సినిమాలో జెమిని గణేశన్ పాత్ర చేసిన ఈ హీరో..తనదైన స్టైల్ లో మెప్పించాడు. ఆ తరువాత తెలుగులో పెద్దగా తెర పై కనిపించని ఈ హీరో.. రీసెంట్ గా సీతారామం సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు.

హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలోనే స్టార్స్ హీరో మొదలు..కమెడీయన్స్ వరకు అందరు ఈ సినిమా పై తమకు తోచిన విధంగా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాని తెలియజేశారు. ఈ క్రమంలోనే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఎవ్వరు ఊహించని విధంగా..సరికొత్తగా తనదైన స్టైల్ లో పోస్ట్ పెట్టారు.

ఆ పోస్ట్ లో ఏముందంటే..”డియర్ హను… ఐ హేట్ యూ. ఎందుకంటే ఈ సినిమాలోని అన్ని పాత్రలను చాలా జాగ్రత్తగా అందంగా తెరకెక్కించినందుకు. సినిమా మొత్తం అందమైన పెయింటింగ్ తో సాగే సంగీతం లా మనసుకు ప్రశాంతతను సృష్టిస్తుంది. అలాగే దుల్కర్ సల్మాన్..ఐ హేట్ యూ..నీ నటన చూస్తుంటే..అసూయ గా ఉంది. మీ నటనను నేను ఎప్పటికీ ఆరాధిస్తాను. కానీ ఈ సినిమా విషయంలో నేను మిమ్మల్ని ద్వేషిస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమా నటుడిగా నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. రామ్ గా మీరు ఊపిరి తీసుకున్నారు.. రామ్ గా మీరు జీవించారు..”అంటూ పోస్ట్ చేసారు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news