Moviesఈవీవీ స‌త్య‌నారాయ‌ణ బెడ్ రూం సీన్ దెబ్బ‌కు ఏడ్చేసిన సీనియ‌ర్ న‌టి...!

ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ బెడ్ రూం సీన్ దెబ్బ‌కు ఏడ్చేసిన సీనియ‌ర్ న‌టి…!

టాలీవుడ్‌లో కొంద‌రు ద‌ర్శ‌కులు త‌మ సినిమాల‌లో న‌టించే ఇత‌ర న‌టీన‌టులు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌కు క‌థ‌, త‌మ క్యార‌క్ట‌ర్ ఏంటో ? అస‌లు చెప్ప‌రు. సీనియ‌ర్ ద‌ర్శ‌కులు త‌మ సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు న‌టించ‌డ‌మే గొప్ప, తాము వారికి అవ‌కాశం ఇవ్వ‌డ‌మే గొప్ప అన్న‌ట్టుగా ఫీల‌వుతార‌ట‌. ఈ విష‌యాన్ని చాలా మంది క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు చెప్పి త‌మ ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంటారు. కొంద‌రు సీనియ‌ర్ ద‌ర్శ‌కులు.. హీరోలు, హీరోయిన్లు లేదా సీనియ‌ర్ న‌టుల‌కు మాత్ర‌మే త‌మ‌ పాత్ర ఏంటో చెపుతారు త‌ప్ప మిగిలిన వాళ్ళ గురించి అస్స‌లు ప‌ట్టించుకోర‌ట‌. వాళ్ళు సెట్టుకు వ‌చ్చినప్ప‌డు మాత్ర‌మే ఆ సీన్ గురించి చెప్పి చేయ‌మంటార‌ట‌.

 

ఈ క్ర‌మంలోనే దివంగ‌త ద‌ర్శ‌కులు ఈవివి. స‌త్య‌నారాయ‌ణ కూడా త‌న సినిమాలో ప‌నిచేసే చాలా మంది న‌టీన‌టుల‌కు ముందు క‌థ ఏంటో ? చెప్ప‌ర‌ట‌. వాళ్ళంతా డైరెక్టుగా షూటింగ్‌కి వెళ్ళాక ఆయ‌న చెప్పిన సీన్ల‌లో న‌టించాల్సి ఉంటుంది. ఈవివి. స‌త్య‌నారాయ‌ణ పెద్ద కూమారుడు ఆర్య‌న్ రాజేష్ హీరోగా ఎవ‌డి గోల వాడిది సినిమా త‌రకెక్కించారు. ఈ సినిమా కోసం బ్యాంకాక్‌లో అయ‌న నెల రోజుల పాటు ప్ర‌ధాన న‌టీన‌టులు, కామెడి న‌టుల‌తో ఒక‌ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. సీనియ‌ర్ న‌టి తెలంగాణ శ‌కుంతల ఈ సినిమాలో క‌మెడియ‌న్ కృష్ణ భ‌గ‌వాన్‌కు భార్య‌గా న‌టించారు.

వీరిద్ద‌రి మ‌ధ్య ఒక రోజు హోట‌ల్లో బెడ్ రూమ్ సీన్ ఉంటుంద‌ని.. అప్ప‌టిక‌ప‌క‌పుడు తెలంగాణ శ‌కుంత‌ల‌కు చెప్పార‌ట డైరెక్ట‌ర్‌. అయితే శ‌కుంత‌ల‌ వ‌య‌సులో పెద్ద. ఆమె అప్ప‌టికే అమ్మ‌, అత్త క్యారెక్ట‌ర్ల‌లో న‌టించారు. త‌న‌తో ఈ వ‌య‌సులో బెడ్ రూమ్ సీన్లు చేపిస్తే… త‌న కుటుంబ స‌భ్యులు ఏమ‌నుకుంటారు ? త‌న బంధువుల ముందు తాను ఏమ‌వ్వాలి అని శ‌కుంత‌ల భోరున ఏడ్చేశార‌ట‌. ఒక వేళ తాను ఈసీన్ చేయ‌న‌ని చేబితే అన‌వ‌స‌రంగా ఈ షెడ్యుల్ క్యాన్సిల్ అవుతుంద‌ని తీవ్ర ఆవేద‌న‌కు గుర‌య్యార‌ట‌.

అటు ఆ సీన్ చేయ‌లేక.. ఇటు ఈ సినిమాను వ‌దులుకొని ఇండియాకు రాలేక అమె తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యార‌ట‌. అయితే చివ‌ర‌కు అస‌భ్య‌త‌కు తావు లేకుండా కృష్ణ భ‌గ‌వాన్, తెలంగాణ శ‌కుంత‌ల మ‌ధ్య ఆ బెడ్ రూమ్ సీను షూట్ చేశారట‌. సినిమాలో ఆ సీన్ బాగా హైలైట్ అయింది. చివ‌ర‌కు ఎవ‌డి గోల వాడిది సినిమా కూడా సూప‌ర్ హిట్ అయింది. ఈ సినిమా ఆర్య‌న్‌ రాజేష్ కెరియ‌ర్‌లో ట‌ర్నింగ్ పాయింట్‌గా మిగిలిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news