Moviesసినిమాల కోసం శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ సంచలన నిర్ణయం..ఇది అసలైన...

సినిమాల కోసం శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ సంచలన నిర్ణయం..ఇది అసలైన షాక్ అంటే..!?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొదవలేదు. మారుతున్న కాలానికి సాగుతున్న కొత్త ట్రెండుకి కుర్ర బ్యూటీ లు వస్తూనే ఉంటారు. కానీ అందరూ స్టార్ హీరోయిన్లుగా మారుతారని నమ్మకం లేదు. బడా బడా హీరో కూతుర్లే హీరోయిన్లుగా మెప్పించలేక తట్ట బుట్టా సర్దేసుకోని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయిన దాఖలాలు ఉన్నాయి. అలాంటిది ఓ డాన్స్ మాస్టర్ కూతురు హీరోయిన్ గా వస్తుంది అంటే కచ్చితంగా జనాల్లో ఓ నమ్మకం ఉంటుంది ఆ అమ్మాయి హీరోయిన్ గా ఎదగలేదు అని. ఇది ఆ అమ్మాయిని నిరాశపరిచేందుకు చెప్పడం లేదు కానీ జరగబోయే సత్యమే. ఖచ్చితంగా శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ హీరోయిన్ గా ఎదగలేదు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.

మనకు తెలిసిందే సూపర్ స్టెప్స్ తో కొత్త కొత్త నృత్యాలతో శేఖర్ మాస్టర్ ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్లు డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేస్తారు . మెగాస్టార్ చిరంజీవి నుంచి నిన్న కాక మొన్న వచ్చిన చిన్న హీరోల వరకు అందరి స్టార్ హీరోలకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వర్క్చేసారు. పలు బుల్లితెర డాన్స్ షోలకు జడ్జ్ గా వ్యవహరించారు. జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది అలాంటి ఫాలోయింగ్ క్రేజ్ ఉన్న శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ ప్రజెంట్ హీరోయిన్ గా సినిమా చేస్తుంది అంటూ గత కొద్ది రోజులకు ఓ వార్త వైరల్ గా మారింది. దీనిపై అఫీషియల్ ప్రకటన రానప్పటికీ బ్యాగ్రౌండ్ లో మాత్రం కధకు సంబంధించిన చర్చలు జరిగిపోయాయి అని ..యంగ్ డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని.. అలాగే ఓ యంగ్ హీరో ఈ సినిమాలో ఆమెతో హీరోగా నటిస్తున్నారని తెలుస్తుంది .

దీనికోసం శేఖర్ మాస్టర్ చాలా కష్టపడ్డట్టు సినీ వర్గాలలో టాక్ నడుస్తుంది. అయితే హీరోయిన్ గా పూర్తి ఫోకస్ సినిమాలపై చేయడానికి శేఖర్ మాస్టర్ కూతురు సాహితి సంచల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సినిమాలపై ఆసక్తిగల శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ డాన్స్ అంటే చాలా ఇష్టం తండ్రి కొరియోగ్రాఫర్ కావడంతో స్వతహాగానే ఆమెకు డాన్స్ పట్ల ఆసక్తి ఉంది. అయితే హీరోయిన్ అంటే డాన్స్ ఒక్కటే వస్తే సరిపోదు కదా.. గ్లామర్, యాక్టింగ్, ఎమోషన్స్ పండించాలి. దాని కోసం ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకుంటుందట . ఈ క్రమంలోనే ఆమె డ్యాన్స్ కు ఎక్కువ టైం కేటాయించలేకపోతుందని

..దీనికోసం ఆమె కొన్ని రోజులు డ్యాన్స్ ను పక్కన పెట్టాలని అనుకుంటుందట. నిజానికి సాహితి ది చాలా చిన్న వయసు హీరోయిన్ గా ఎంటర్ అయ్యే వయసు అసలే కాదు. కానీ, శేఖర్ మాస్టర్ ఎందుకు సాహితీ విషయంలో ఇలాంటి తప్పు చేస్తున్నాడో .. ఇంత చిన్న వయసులోనే ఆమెను సినీ రంగంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడో అర్థం కావడం లేదు. ఒకవేళ సాహితి హీరోయిన్ గా ఫెయిల్ అయితే కచ్చితంగా డ్యాన్సర్ గా కూడా ఆమెను ఇండస్ట్రీలో బ్రతకనివ్వరు. ఆ విషయం అందరికీ తెలిసిందే. మరి చూస్తూ చూస్తూ శేఖర్ మాస్టర్ తన కూతురి జీవితాన్ని నిప్పుల్లోకి నెట్టేస్తారా..? తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news