Moviesఇక పై ఆమెను కలవడానికి వెళ్లితే..ఇది తీసుకెళ్లాల్సిందే..క్రేజీ కండీషన్ పెట్టిన క్రష్మిక..!?

ఇక పై ఆమెను కలవడానికి వెళ్లితే..ఇది తీసుకెళ్లాల్సిందే..క్రేజీ కండీషన్ పెట్టిన క్రష్మిక..!?

నేషనల్ క్రష్ గా పిలుచుకొనే రష్మిక మందన క్రేజ్‌ రోజు రోజుకు భారీగా పెరిగిపోతుంది. కన్నడ సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన ఈ భామ తెలుగు చిత్ర సీమలో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగు కన్నడ తో పాటు తమిళ బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది.

దీంతో వరుస‌ సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ప్టాపులో ఉన్న టాలీవుడ్ హీరోలు రష్మిక తమ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తే తమ సినిమాకు సక్సెస్ దక్కుతుందని భావిస్తున్నారు. సరిగ్గ ఇదే టైం ని క్యాష్ చేసుకుంది..రష్మిక. ఒక్కసారిగా భారీ స్దాయిలో రెమ్యూనరేషన్ ని పెంచేసింది. బాలీవుడ్లో ఒక్కో సినిమాకు ఐదు కోట్లు దాకా రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్న ఈ బ్యూటి.. తెలుగులో అయితే ఒక్కో సినిమాకు మూడు కోట్ల 50 లక్షలు తీసుకుంటుందట.

అయితే తాజాగా రష్మిక తన సినిమాల విషయంలో కొత్త కండీషన్స్ పెడుతుందట. భారీ హిట్స్ అందుకుంటున్న రష్మిక అంటే జనాలకి అదో మోజు. అందుకే వరుస అవకాశాలు ఇస్తున్నారు దర్శకనిర్మాతలు. అయితే, ఇక పై సినిమా కి కమిట్ అయినప్పుడే అగ్రిమెంట్ మీద సంతకం చేసిన్నప్పుడు 70 % రెమ్యూనరేషన్ ఇచ్చేసేయాలి అనే కండీషన్ పెట్టిందట. దానికి కారణం లేకపోను లేదు. స్టార్ హీరోలు అందరు..సినిమా కి కమిట్ అయ్యి..లేట్ గా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమ్మడు ఒప్పుకున్న సినిమా పారితోషం అందుకోవాలంటే సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుందట. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఓ వార్త వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news