Movies"నాకు అలాంటి ఆశలు లేవు"..పెళ్లి పై సింధు ఊహించని కామెంట్స్..!!

“నాకు అలాంటి ఆశలు లేవు”..పెళ్లి పై సింధు ఊహించని కామెంట్స్..!!

పీవీ సింధు.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పతాకాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతూ మన భారతదేశ పరువును ప్రతిష్టను ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్న స్టార్ అధ్లేట్. క్రీడాకారులకు ఫాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇప్పటివరకు మనం చూసుకున్నట్లైతే.. మగ క్రీడాకారులకే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండింది. కానీ ఫస్ట్ టైం లేడీ క్రీడాకారునికి ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందా అని ప్రూవ్ చేసింది సింధు. రియో ఒలంపిక్ లో మెడల్ సాధించిన సింధూ ఈ మధ్యనే కామన్వెల్త్ గేమ్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించి.. స్టార్ షట్లర్ గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

పీవీ సింధు తాజాగా ఆలీతో సరదాగా అనే టాక్ షోకు వచ్చి సందడి చేసింది. ఈ షో లో ఆమె మాట్లాడిన మాటలు చూసి అంత షాక్ అయ్యారు. పీవీ సింధుకు “ఇన్ని మాటలు వచ్చా.. ఇంత అల్లరి పిల్ల.. ఇంత సరదాగా ఉంటుందా..” అంటూ ఆమె గురించి సోషల్ మీడియాలో చెప్పుకొస్తున్నారు. ఈ షోలో సింధు తన గేమ్ లైఫ్ గురించి కాకుండా పర్సనల్ లైఫ్ గురించి కూడా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమా ,ఆటలు తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలని ఆమె ఈ షో ద్వారా అభిమానులతో పంచుకుంది.

ఆలీ తో సరదాగా షోలో పీవీ సింధును ఆలీ ఆట పట్టించిన విజువల్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి . అలీ మాట్లాడుతూ..” ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ మీకు ఇష్టమైన హీరో ఎవరు” అని అడుగుతారు. ” ఇండస్ట్రీలో నాకు చాలా మంది హీరోల ఫ్రెండ్స్ ఉన్నారు ” అంటూ సింధు చెప్పగా.. అప్పుడు ఆలీ “అందరూ కాదు ఎవరైనా ఒక్కరి పేరు చెప్పు”.. అనగానే తడుముకోకుండా పీవీ సింధు వెంటనే ప్రభాస్ పేరు చెబుతుంది . అప్పుడు ఆలీ “ఎందుకు మీ అంత హైట్ ఉన్నాడ..నా మీరు మీరు ఒకే హైట్ అనేగా”.. అంటే “ఎస్ ఎస్ అవును” అంతే అంటూ సింధూ సరదాగా నవ్వుకునేస్తుంది.

ఇంకా ఈ షోలో ఆమె మాట్లాడుతూ..” తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రజెంట్ అయితే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పిన పీవీ సింధు తన కాన్సన్ట్రేషన్ మొత్తం 2024 గేమ్‌స్ పైనే ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఎలాగైనా సరే 2024 ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. అంతే కాదు తనకి సినిమా ఇండస్ట్రీలో చాలామంది బంధువులు ఉన్నారని..” స్టార్ నిర్మాత అశ్విని దత్ మా అమ్మ తరుపున బంధువులు అవుతారని.. అంతే కాదు మిగతా చాలా మంది దూరపు రిలేషన్స్ కూడా ఉన్నారని.. తన తాతయ్య తోణేపూడి బ్రహ్మయ్య సీనియర్ ఎన్టీఆర్ నటించిన “బందిపోటు, కలవారి సంసారం “సినిమాలను నిర్మించారని చెప్పకొచ్చింది. అయితే పెళ్లి మాత్రం తనకు ఇష్టమైన అబ్బాయిని చేసుకుంటానని ..కచ్చితంగా సినిమా వాళ్ళు మాత్రం చేసుకోనని..సినిమా వాళ్ళని చేసుకోవాలనే ఆశ తనకు లేదని” కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news