Moviesప్ర‌గ్య జైశ్వాల్ మీద ఆ స్టార్ డైరెక్ట‌ర్ హ్యాండ్ ప‌డితేనే లైఫ్...

ప్ర‌గ్య జైశ్వాల్ మీద ఆ స్టార్ డైరెక్ట‌ర్ హ్యాండ్ ప‌డితేనే లైఫ్ ఉందా…!

చిన్న చిన్న సినిమాలతో పాపులర్ అవుతూ ఏకంగా నందమూరి బాలకృష్ణ లాంటి అగ్ర హీరోతో సినిమా చేసే అవకాశం అందుకున్న దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి. మొదటి సినిమా గమ్యం. ఈ సినిమాలో శర్వానంద్, అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించారు. కమ‌లినీ ముఖర్జీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఎప్పుడు మొదలైంది.. ఎప్పుడు అయిపోయింది అనేంత వేగంగా సినిమా కథ, కథనం సాగుతాయి. అందరికీ ఈ సినిమా మంచి హిట్ ని కిక్ ని ఇచ్చింది. మరీ ముఖ్యంగా అల్లరి నరేష్ కెరీర్ లో ఈ సినిమా మైల్ స్టోన్ లాంటిది.

దీని తర్వాత చేసిన సినిమా వేదం. ఇలాంటి కథను రెండవ సినిమాగా చేయాలంటే ఎంతో అనుభవం ఉండాలి. సినిమా ఫ్లాపైనా వేదం కూడా అల్లు అర్జున్, అనుష్క, మంచు మనోజ్, దర్శకుడు క్రిష్ కి మంచి మెమరబుల్ మూవీగా నిలిచింది. ఈ సినిమా కి వసూళ్ళు బాగానే వచ్చాయి. ఇలాంటి సినిమాలు తీసి టాలీవుడ్ లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న క్రిష్ ఆ తర్వాత చేసిన కంచె మంచి హిట్ సాధించింది. ఈ సినిమాతో ప్రగ్యా జైస్వాల్ కి సూపర్ హిట్ ఇచ్చాడు.

కంచె కంటే ముందు ప్రగ్యా ఓ సినిమా చేసింది. కానీ, పాపులర్ అయింది మాత్రం కంచె సినిమాతో. ఈ సినిమాలో ప్రగ్యాను క్రిష్ చాలా అద్భుతంగా చూపించాడు. చక్కగా చీరలో రొమాంటిక్‌గా సిల్వర్ స్క్రీన్ మీద చూపించి క్రేజ్ తెచ్చిపెట్టాడు. ఈ సినిమా తర్వాత అందరూ ప్రగ్యా జైస్వాల్ పెద్ద హీరోయిన్ అవుతుందని భావించారు. అవకాశాలు కూడా వచ్చాయి. జయ జానకి నాయక, నక్షత్రం లాంటి సినిమాలలో అందాల ఆరబోతతోనూ మోత మోగించింది. కానీ, ఆ సినిమాలు ఫ్లాపవడం ప్రగ్యాకు మైనస్ అయింది.

ఎట్టకేలకి మళ్ళీ బాలయ్య సినిమా అఖండతో హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత ఇక తిరుగు లేదనుకున్నారు. కానీ, ప్రగ్యా కి కొత్త అవకాశాలు రాలేదు. మళ్ళీ క్రిష్ గనక తన సినిమాలో అవకాశం కల్పించి భారీ హిట్ ఇస్తే ప్రగ్యా కాస్త ఫాంలోకి వస్తుంది. అసలే మన ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకి హీరోయిన్స్ సెట్ అవడం లేదు. అలాంటి వారికి ప్రగ్యా పర్‌ఫెక్ట్. కానీ, హిట్టే ఒక్కటి పడాలి. అది క్రిష్ వల్లే అవుతుందని అంటున్నారు.

క్రిష్ – ప్ర‌గ్య బంధం వ‌ల్లే క్రిష్ వ్య‌క్తిగ‌త జీవితంలో క‌ల‌త‌లు వ‌చ్చాయ‌న్న ప్ర‌చారం కూడా ఉంది. ప్ర‌గ్య అంటే క్రిష్‌కు ప్ర‌త్యేక‌మైన ప్రేమ ఉందన్న గుస‌గుస‌లు అయితే ఉన్నాయి. ఇక క్రిష్ ఇప్పుడు ప్ర‌గ్య‌ను లేపాలంటే మ‌నోడు ఇప్పటికే పవన్ కళ్యాణ్ హీరోగా హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు. దీనిలో ఛాన్స్ లేదు. మరి నెక్స్ట్ సినిమా సంగతేంటో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news