Moviesసినిమాకు బ్యాక్ బోన్ ఆయనే..'బింబిసార'పై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ రివ్యూ..!!

సినిమాకు బ్యాక్ బోన్ ఆయనే..’బింబిసార’పై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ రివ్యూ..!!

‘బింబిసార’..నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా అందాల ముద్దుగుమ్మలు కేథ‌రిన్ – సంయుక్త మీన‌న్ కలిసి నటించిన సినిమా. సినిమా పేరుతో నే సగం హిట్ కొట్టేశాడు ఈ నందమూరి వారసుడు. నిజానికి కల్యాణ్ రామ్ కు కొన్నాళ్లు గా సరైన హిట్ నే లేదు. ఈ కర్మంలో భారీ అంచనాల మధ్య వచిన ఈ బింబిసారా..బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమా మొత్తానికి వన్ మ్యాన్ ఆర్మీ గా నిలిచి..పూర్తి విజయానికి కారకుడైయాడు కళ్యాణ్ రామ్.

 

ఒక్క ముక్కలో చెప్పాలంటే..ఈ సినిమా లో బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ తప్పిస్తే మరెవ్వరిని చూడలేం..ఊహించుకోలేం. మనకు బింబిసారుడు ఎలా ఉంటాడో తెలియదు. ఈ సినిమా చూసిన తరువాత మాతర్మ్ బింబిసారుడు అంటే కళ్యాణ్ రామ్ అనే చెప్పుతారు జనాలు. అంతలా లీనమైపోయి నటించారు. ఈ సినిమా ంచూసిన జనాలు కూడా కళ్యాణ్ రామ్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. రివ్యూ రేటింగ్ లు కూడా ఆల్ మోస్ట్ అందరు 3 to 4 మధ్య నే ఇస్తున్నారు. అంటే ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనమాట.

తాజాగా అన్న సినిమా గురించి ట్వీట్ చేశాడు తారక్. ప్రి రిలీజ్ ఈవెంట్ కు వచ్చి..అభిమానులను ఉత్సాహ పరిచిన తారక్..ఇప్పుడు ‘బింబిసార’పై తనదైన స్టైల్ లో రివ్యూ ఇచ్చారు. ఆయన ట్వీట్ చేస్తూ..” బింబిసార మూవీని ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ధ్రిల్ గా ఫీల్ అయ్యా. ఇప్పుడు ఆ సినిమా గురించి గొప్పగా పాజిటివ్ కామెంట్స్ వింటుంటే చాలా ఆనందంగా ఉంది. నేను తొలిసారి ఈ చిత్రాన్ని చూసినప్పుడు ఎంత ఉత్సాహంగా చూశానో.. ప్రేక్షకులు కూడా అంతే ఉత్సాహం చూపిస్తుండడం సంతోషంగా ఉంది. అస్సలు బింబిసార రోల్ కళ్యాణ్ రామ్ అన్నని తప్పిస్తే మరొకరిని ఊహించుకోలేను… దర్శకుడు వశిష్ట్ ఈ చిత్రాన్ని మరో మెట్టు ఎక్కించారు. కీరవాణి గారి సంగీతం ఈ చిత్రానికి బ్యాక్ బోన్. అందరు టెక్నీషియన్స్, నటులకు అభినందనలు..” అంటూ తనదైన స్టైల్ లో ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news