Moviesనాని - నివేదా థామ‌స్ మ‌ధ్య ఆ రిలేష‌న్ బ‌య‌ట పెట్టిన...

నాని – నివేదా థామ‌స్ మ‌ధ్య ఆ రిలేష‌న్ బ‌య‌ట పెట్టిన వీడియో ఇదే…!

టాలీవుడ్‌లో మినిమం గ్యారెంటీ హీరో ఎవరైనా ఉన్నారంటే అది నేచుర‌ల్ స్టార్‌గా పాపులర్ అయిన నాని. అగ్ర దర్శకుడు మణిరత్నం వద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తూ అదృష్టం కలిసొచ్చి ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకుడిగా మారుతూ రూపొందించిన అష్టా చమ్మా సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత జెండాపై కపిరాజు, స్నేహితుడా, ఈగ లాంటి సినిమాలు నానీని హీరోగా నిలబెట్టాయి. కథ, అందులోని తన పాత్ర చాలా డీప్‌గా తెలుసుకొని పాత్రలో లీనమై నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు.

అందుకే, నానికి నేచురల్ స్టార్ అని పేరొచ్చింది. ముఖ్యంగా ఇతర హీరోలు దర్శకనిర్మాతలు నానిని ఇలాగే పిలుస్తూ ప్రశంసిస్తుంటారు. నిర్మాతలు ఎప్పుడూ అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉండేది నానికే అని కూడా ఇండస్ట్రీలో చెప్పుకుంటుంటారు. నానితో సినిమా తీసిన ఏ నిర్మాత ఎప్పుడూ నిండా మునిగిన దాఖలాలు లేవనే చెప్పాలి. తన సినిమా ఫ్లాపయినా బాక్సాఫీస్ వద్ద నిర్మాత పెట్టిన డబ్బు మాత్రం గ్యారెంటీగా తిరిగొస్తుంది. ఇంత నమ్మకం ఉన్న నాని మీద హీరోయిన్స్ కూడా బాగానే ఆసక్తి చూపిస్తుంటారు.

సినిమా షూటింగ్ సమయంలో ఏ మాటలు చెప్పి ఆకట్టుకుంటాడో..లేక తన నేచురల్ పర్ఫార్మెన్స్‌కి నిజంగానే ఫిదా అవుతారో గానీ.. షూటింగ్ అయిపోయి ఆడియో ఫంక్షన్స్, లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో తన పక్కన నటించిన హీరోయిన్స్ నానిని ఆకాశానికి ఎత్తేస్తుంటారు. ఇలా అంటే మరో సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తాడేమో అని కూడా కారణం కావచ్చు. ఏదేమైనా హీరోయిన్స్ మాత్రం నాని అంటే పడి చస్తుంటారు. ముఖ్యంగా నివేదా థామస్ నాని సరసన జెంటిల్ మేన్ సినిమాలో హీరోయిన్‌గా నటించిది.

ఈ సినిమాలో ఇద్దరి జంట కూడా బాగా ఆకట్టుకుంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా ఇద్దరూ పోటీ పడి నటించారు. అయితే, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో నాని రాగానే ఎవరూ ఊహించని విధంగా నివేదా వెళ్ళి ఎదురుగా వస్తున్న నానీని గట్టిగా కౌగిలించుకొని ఉక్కిరిబిక్కిరి చేసింది. అలా పరిగెడుతున్నప్పుడు నివేదాను వెనకనుంచి కవర్ చేసిన వీడియో మీద ఇప్పటికీ యూట్యూబ్‌లో నెటిజన్స్ ఓ లుక్ వేస్తుంటారు.

నివేదా బ్యాక్ ఫోజ్ కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. ఎవరైనా నాని – నివేదాల మీద వార్తలు రాస్తే ఖచ్చితంగా ఈ వీడియోను అలాగే పిక్స్ ని చూపిస్తుంటారు. అంతగా ఈ వీడియో వైరల్ అయింది. ఇక ఇది చూసిన ప్రతీసారి వీరి మధ్య ఏదో ఉందని మాట్లాడుకుంటుంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news