Moviesబాల‌య్య‌తో భ‌లే ఛాన్స్ మిస్ అయ్యానే.... ఎప్ప‌ట‌కీ ఫీల‌వుతాన‌న్న కాజ‌ల్‌...!

బాల‌య్య‌తో భ‌లే ఛాన్స్ మిస్ అయ్యానే…. ఎప్ప‌ట‌కీ ఫీల‌వుతాన‌న్న కాజ‌ల్‌…!

కాజ‌ల్ మూడున్న‌ర పదుల వ‌య‌స్సు దాటేసినా కూడా మంచి ఛ‌రిష్మాతోనే ఉంటోంది. పెళ్ల‌య్యి త‌ల్ల‌య్యాక కూడా కాజ‌ల్‌లో జోష్‌, గ్లామ‌ర్ ఏ మాత్రం త‌గ్గ‌న‌ట్టుగానే ఉంటుంది. అయితే ఇటీవ‌ల కాలంలో కాజ‌ల్ సీనియ‌ర్ హీరోల‌కు బెస్ట్ ఆప్ష‌న్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ఆయ‌న రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150లో న‌టించింది. ఆ త‌ర్వాత ఆచార్య‌లో మ‌రోసారి ఆమెకు ఛాన్స్ వ‌చ్చినా క‌రోనా కార‌ణంగా సినిమా లేట్ అవ్వ‌డం.. ఇదే టైంలో ఆమె పెళ్లి చేసుకుని ప్రెగ్నెంట్ అవ్వ‌డంతో ఆ ఛాన్స్ మిస్ అయ్యింది.

నాగార్జున ది ఘోస్ట్ సినిమాలోనూ ముందు ఆమెనే హీరోయిన్ అనుకున్నారు. ఆమె పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఆ ఛాన్స్ సోనాల్ చౌహాన్‌కు వ‌చ్చింది. అంటే చిరుతో రెండోసారి జోడీ క‌ట్టే ఛాన్స్‌తో పాటు అటు సీనియ‌ర్ హీరో, న‌ట‌సింహం బాల‌కృష్ణ‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమాలో న‌టించే ఛాన్స్ వ‌చ్చినా కూడా వ‌దులుకుంది. అదే అఖండ సినిమా.

బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో ప్ర‌గ్య జైశ్వాల్ బాల‌య్య‌కు జోడీగా హీరోయిన్‌గా న‌టించింది. అయితే ఈ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా ముందుగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. బోయ‌పాటి వెళ్లి కాజ‌ల్‌కు క‌థ కూడా చెప్పారు. అయితే కాజ‌ల్ అప్పుడు కొన్ని క‌మిట్‌మెంట్ల‌తో బిజీగా ఉండ‌డంతో బాల‌య్య అఖండ‌ను రిజెక్ట్ చేసింది. అలా బాల‌య్య – కాజ‌ల్ కాంబినేష‌న్లో రావాల్సిన సినిమా మిస్ అయ్యింది.

అయితే ఈ మంచి సినిమా మిస్ అయిపోయాన‌ని కాజ‌ల్ ఇప్ప‌ట‌కీ స‌న్నిహితుల వ‌ద్ద ఫీల్ అవుతూ ఉంటోంద‌ట‌. ఈ ముదురు ఏజ్‌లో ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమాలో న‌టించి ఉంటే చివ‌రి ద‌శ‌లో కాజ‌ల్ కెరీర్ మ‌రి కొంత కాలం పొడిగి ఉండేది. మ‌రిన్ని మంచి ఛాన్సులు వ‌చ్చేవి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news