Movies"ఆ ఐరెన్ లెగ్ హీరో మాకు వద్దు"..రచ్చ గా మారిన లైగర్...

“ఆ ఐరెన్ లెగ్ హీరో మాకు వద్దు”..రచ్చ గా మారిన లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ నేమ్..?

లైగర్..సాలా క్రాస్ బ్రీడ్.. ఇప్పుడు ఇదే పేరు ప్రపంచమంతా మారుమోగిపోతుంది.గత కొంతకాలంగా హిట్ లేకుండా బాధపడుతున్న పూరీ జగన్నాధ్.. తన ఆశలన్నీ ఈ సినిమా పైన పెట్టుకొని ఉన్నాడు. ఓ విధంగా చెప్పాలంటే పూరి భవిష్యత్తుని మార్చబోయే సినిమా ఇదే అంటున్నారు సినీ విశ్లేషకులు. తన అదృష్టాన్ని పూరి జగన్నాథ్ మార్చుకోగలడు..టాలీవుడ్ లో సినిమాలు తీయగలడు.. ఇంకా ఆయన లో పవర్ ఉంది అని అనుకునే ఈ సినిమాతోఆన్సర్ ఇవ్వబోతున్నాడు పూరీ జగన్నాధ్.

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే, టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న సినిమానే ఈ లైగర్. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తున్నారు లైగర్ మూవీ టీం.
కాగా ఆగస్టు 25న ఈ సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రమోషన్స్ పనులు అన్ని పూర్తి చేశాడు విజయ్ దేవరకొండ, చార్మి, అనన్యపండే, పూరీ జగన్నాధ్. కాగా రిలీజ్ టైం దగ్గరకొస్తుండడంతో.. సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు లైగర్ మూవీ టీం .

ఈ క్రమంలోని లైగర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవిని పిలవడానికి నిర్ణయించుకున్నారు. అయితే ఓ బ్యాడ్ సెంటిమెంట్ దీనికి అడ్డుపడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. దారుణమైన టాక్ ను సంపాదించుకున్నాయి. దీంతో మెగాస్టార్ హీరోని కొందరు మెగా హీటర్స్ ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హిట్ కోసం ఎదురు చూస్తున్న పూరీ జగన్నాథ్ ఐరన్ లెగ్ ని ప్రీరిలీజ్ ఈవెంట్ కి పిలవద్దు అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి తీసుకొస్తున్నారు. అయితే అంత పెద్ద మెగాస్టార్ ను ఐరన్ లెగ్ అనడం మెగా అభిమానులకు నచ్చడం లేదు. దీంతో సోషల్ మీడియాలో లైగర్ VS మెగా వార్ మొదలైంది. కొందరు మీ హీరో విజయ్ కి అంత సీన్ లేదు అంటూ లైగర్ ఫ్లాప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news