Moviesబింబిసార 2 లో మరో హీరో.. సీక్వెల్ స్టోరీ ని బయటపెట్టిన...

బింబిసార 2 లో మరో హీరో.. సీక్వెల్ స్టోరీ ని బయటపెట్టిన కళ్యాణ్ రామ్..!!

బింబిసార..ఇప్పుడు ఈ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించింది బ్లాక్ బస్టర్ హిట్ అయినా సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వశిస్ట్ అద్భుతంగా తెరకెక్కించాదు. నిజానికి ఈ సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యాడు. మొదటి సినిమా నే హిట్ అవ్వటంతో అగ్ర దర్శకుల లిస్టులో చేరిపోయారు. ఇక ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ చూస్తే..నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా న్లిచింది.

బింబిసార సినిమా హిట్ అవ్వదంతో..బింబిసార 2 కూడా రాబోతుందని క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. దీంతో అప్పుడే బింబిసార సీక్వెల్ పై బోలెడు అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో మరో హీరోని కూడా యాడ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ అంటూ..ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఆ హీరో ఎవర్రా అంటు నెట్టింట కొత్త చర్చ మొదలైంది. ఇది ఇలా ఉండగా..బింబిసారా సక్సెస్ అయిన సంధర్భంగా కల్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యులో ముచ్చటించారు.

ఈ క్రమంలోనే ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. సినిమా క్లైమాక్స్ లో బింబిసార చనిపోయినట్లు చూపించారు.. అయితే సినిమాలో వచ్చిన సంజీవిని పుష్పం ద్వార ఆయన బ్రతికించే అవకాశాలు ఉన్నాయని చాలామంది అనుకుంటున్నారు. తాజాగా వినాయక్ మూవీ టీం ను ఇంటర్వ్యూ చేసినప్పుడు కళ్యాణ్ రామ్ మరియు దర్శకుడు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ సినిమా సీక్వల్ లో బింబిసారా ఎందుకు తన తమ్ముడిని చంపాడు అన్ని.. రాజ్యాలపై ఎందుకు యుద్ధం చేశాడు అతనిలో ఇంకా ఎంత క్రూరత్వం దాగి ఉంది అని అంశాలను చూపించబోతున్నారట.

ఈ అంశాలను కళ్యాణ్ రామ్ వివి వినాయకతో జరిగిన ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. ఆ టైంలో కళ్యాణ్ రామ్ మాట్లాదుతూ..”దీన్ని తీయడానికి చాలా బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది. కానీ నాకు చాలా తక్కువ మార్కెట్” అంటూ చెప్పే క్రమంలోనే… వినాయక్ ఎంటర్ అయ్యి..” నీకు ఇప్పుడు మార్కెట్ బాగా పెరిగింది” అంటూ చమత్కరించాడు. మొత్తంగా బింబిసార 2 లో మరో కళ్యాణ్ రామ్ ని చూడబోతున్నాం అని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news