Moviesమహేష్ బ్లాక్ బస్టర్ పోకిరి సినిమాకు ముందు అనుకున్న టైటిల్, హీరోయిన్లు...

మహేష్ బ్లాక్ బస్టర్ పోకిరి సినిమాకు ముందు అనుకున్న టైటిల్, హీరోయిన్లు ఎవరో తెలుసా…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో పాటు 75 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్ర రికార్డులను తిరగరాసిన సినిమా పోకిరి. మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయం అయినా ఒక్కడు సినిమాతో స్టార్‌డం తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మహేష్ కు సరైన సినిమా పడలేదు. 2003 సంక్రాంతికి వచ్చిన ఒక్కడు తర్వాత తిరిగి 2006 సమ్మర్ లో వచ్చిన పోకిరి సినిమాతో మహేష్ తన స్టామినా ఏంటో తెలుగు సినీ జనాలకు చూపించాడు.

విచిత్రం ఏంటంటే పోకిరి సినిమాకు ముందు మహేష్ బాబు నటించిన సినిమాలు అన్ని ప్లాప్ అయ్యాయి. అటు పూరి జగన్నాథ్ కూడా వరుసగా ప్లాపుల‌తో ఉన్నాడు. పోకిరికి ముందు నాగార్జునతో సూపర్ సినిమా భారీ బడ్జెట్ తో తీస్తే అది ప్లాప్ అయ్యింది. ఇలా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పోకిరి సినిమాపై రిలీజ్ కి ముందు ఎలాంటి అంచనాలు లేవు. ఈ సినిమాకి పోటీగా బాలయ్య నటించిన వీరభద్ర సినిమా రిలీజ్ అయింది. ప్రేక్షకులందరూ వీరభద్ర సినిమాపై భారీ అంచనాలతో ఉన్నారు.

అయితే ప్రేక్షకుల అంచనాలు తలకిందులు చేస్తూ పోకిరి తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు తెలుగు సినిమా చరిత్ర పుట్టినప్పటినుంచి ఉన్న అన్ని రికార్డులను చెరిపేసింది. 100 రోజులు – 175 రోజులు… ఏకంగా 365 రోజులు పాటు ఆడి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా దెబ్బతో మహేష్ బాబు టాలీవుడ్ లో ఒక్కసారిగా నెంబర్ వన్ హీరో అయిపోయాడు. అటు పూరి జగన్నాథ్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అయితే ఈ సినిమాకు ముందుగా పోకిరి అనే టైటిల్ అనుకోలేదట. ఉత్తమ సింగ్ S / 0 సూర్యనారాయణ అన్న టైటిల్ తో పూరి కథ రాసుకున్నాడట.

ఇదే కథను ముందు పూరి మాస్ మహారాజ్ రవితేజకు చెప్పాడు. రవితేజ కూడా ఈ సినిమా చేయాలని అనుకున్నాడు. అయితే రవితేజకు అదే సమయంలో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ అనే సినిమాలో ఛాన్స్ రావడంతో పోకిరి సినిమాను రిజెక్ట్ చేశాడు. దీంతో ఇదే కథను పూరి హైదరాబాద్ తాజ్ హోటల్ లో మహేష్ బాబుకు చెప్పి ఓకే చేయించుకున్నాడు. అయితే పూరి మహేష్ కు సిక్కు బ్యాక్ డ్రాప్‌ ఉన్న కథను చెప్పాడు. ఆ సిక్కు బ్యాక్య్ డ్రాప్‌ నేపథ్యాన్ని మార్చాలని పూరికి మహేష్ సూచనలు చేశాడు.

ఇక హీరోయిన్లుగా ముందుగా సూపర్ సినిమాలో నటించిన ఆయేషా టాకీయతో పాటు బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే పేర్లు పరిశీలించారు. వారిద్దరు డేట్లు సర్దుబాటు చేయలేకపోవడంతో అప్పటికే దేవదాసు లాంటి సూపర్ హిట్ సినిమాతో ఫామ్ లో ఉన్న ఇలియానాను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇక టైటిల్ కూడా మార్చాలని మహేష్ కండిషన్ పెట్టడంతో పూరి వెంటనే పోకిరి అని చెప్పడంతో మహేష్ ఓకే చెప్పేశాడు. అలా పోకిరి సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో బిజినెస్‌మేన్ సినిమా కూడా తెరకెక్కి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news