Moviesవారెవ్వా: ఆ విషయంలో ఇద్దరు సేమ్ టూ సేమ్..మీరు గమనించారా..?

వారెవ్వా: ఆ విషయంలో ఇద్దరు సేమ్ టూ సేమ్..మీరు గమనించారా..?

సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం..మాయా లోకం అని కూడా అంటుంటారు. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. లేకపోతే ఒకే విధంగా ఇద్దరు స్టార్ హీరో జీవితాల్లో జరగడం అంటే మామూలు విషయమా. అది కూడా ఇద్దరు బడా హీరోల కొడుకులు లైఫ్ లో ఇలా జరగడం ఇప్పుడు అంతా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సినీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా వాళ్ళల్లో యంగ్ టైగర్ తారక్, సూపర్ స్టార్ మహేష్ బాబు లైఫ్ స్టైల్ నే వేరు . కాంట్రవర్సీల జోలికి వెళ్ళరు.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు.. తమ జోలికొస్తే ఊరుకోరు.. ఒకరి జోలికి ఊరికే పోరు.. ఇదే ఇద్దరు హీరో ఫార్ములా.. అందుకే ఇద్దరు హీరోలని చాలామంది జనాలు లైక్ చేస్తుంటారు.

రీసెంట్ గానే RRR సినిమాతో తన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ ని వేసుకున్న NTR తన తదుపరి సినిమాను కొరటాల శివతో కమిట్ అయిన సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమా కన్నా ముందు తారక్ అప్పుడెప్పుడో అరవింద సమేత వీర రాఘవ సినిమాతో జనాలను పలకరించాడు. ఆ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకుని రాజమౌళి సినిమాతో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఇప్పుడు సేమ్ అదే ఫార్మేట్ లో వెళ్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్.. ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో.. ఓ సినిమా చేస్తున్నాడు. పరిస్థితులన్నీ అనుకూలిచ్చుంటే ఈపాటికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిందే కానీ సమ్మె కారణంగా ఆలస్యం అయింది.

 

SSMB 28 అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు . ఈ సినిమాలో అందాల భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది . ఈ సినిమా అయిపోయిన వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు అభిమానులు. ఈ విధంగా తారక్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు తమ జీవితంలో అనుకోకుండా ఒకే విధంగా ముందుకు సాగుతున్నారు. గతంలో తివిక్రమ్ తో కలిసి అరవింద రాఘవ వీర సమేత సినిమా,, ఆ తర్వాత రాజమౌళి తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ హిట్టు కొట్టిన్నట్లు.. ఇప్పుడు అదే ఫార్మేట్లో.. మహేష్ కూడా త్రివిక్రమ్ తో ఒక సినిమా ఆ తదుపరి వెంటనే రాజమౌళితో మరో సినిమా తీస్తున్నాడు. దీంతో తారక్ మహేష్ అనుకోకుండానే బ్యాక్ టు బ్యాక్ త్రివిక్రమ్ రాజమౌళితో సినిమాలు చేసి సినీ చరిత్రలో కొత్త రికార్డ్ సృష్టించారు. ఇక్కడ ఇంకో చెప్పుకోదగిన విషయం ఏమిటంటే.. తారక్ కి ఫిజికల్ ట్రైనర్ గా వర్క్ చేసిన ల్లాయ్డ్ స్టీవెన్స్ ఇప్పుడు మహేష్ కు ట్రైనర్ గా పనిచెయ్యడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news