Moviesబాల‌య్యకు ' న‌ర‌సింహా స్వామి ' సెంటిమెంట్ ఎలా మొద‌లైందో తెలుసా...!

బాల‌య్యకు ‘ న‌ర‌సింహా స్వామి ‘ సెంటిమెంట్ ఎలా మొద‌లైందో తెలుసా…!

టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. బాలకృష్ణ సినిమా టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. అలాగే బాలయ్యకు సింహా టైటిల్ బాగా కలిసి వచ్చింది. బాలయ్య సినిమా టైటిల్స్ లో చాలా వరకు సింహ అనే సెంటిమెంట్ కూడా ఉంటుంది. సమరసింహారెడ్డి – నరసింహనాయుడు – లక్ష్మీ నరసింహ – సింహ – జై సింహ సినిమాలు సింహ సెంటిమెంట్ తోనే వచ్చాయి. అలాగే సింహా ఇంగ్లీష్ టైటిల్ లయన్ సినిమాలో కూడా బాలయ్య నటించారు. ఓవరాల్గా సింహా అనే టైటిల్ పెట్టుకుంటే బాలయ్యకు ఎక్కువ హిట్ సినిమాలు పడ్డాయి.

 

అసలు బాలయ్యకు ఈ సింహా సెంటిమెంట్ ఎక్కడ ? నుంచి పుట్టింది అన్నది చూస్తే ఆసక్తికరమైన స్టోరీ ఉంది. బాలయ్యకు సహజంగానే దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఆయన ఏ విషయంలో అయినా ముహూర్తాలు చూసుకుని పనులు ప్రారంభిస్తూ ఉంటారు. ఆయనకు విశాఖ జిల్లాలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి అంటే అమితమైన భక్తి. అందుకే ఉత్తరాంధ్ర ఎప్పుడు వెళ్లినా… విశాఖ వెళ్లిన కూడా ఆయన నరసింహ స్వామి వారి దర్శనం చేసుకుంటారు. బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా నుంచి ఈ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు.

ఈ సినిమా షూటింగ్ సమయంలో సింహాద్రి అప్పన్న దైవ సన్నిధిలో ఓ సంఖ్యాశాస్త్ర నిపుణులు 369 అనే టైటిల్ పెట్టుకోమని చెప్పారట. ఈ టైటిల్ పెట్టగా ఆదిత్య 369 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ స్థలం ఆయనకు సెంటిమెంట్ గా మారిపోయింది. అప్పటినుంచి వరాహ లక్ష్మీనరసింహస్వామి అంటే ఆయన ఎంతో ఇష్టంగా భావిస్తారు. అందుకే లక్ష్మీ నరసింహ స్వామిలోని సింహ అనే టైటిల్ కలిసి వచ్చేలాగా తన సినిమాలో టైటిల్స్‌ పెట్టుకోవడం ఆయన సెంటిమెంట్ గా ఫాలో అవుతున్నారు.

అలాగే సింహ – లక్ష్మీనరసింహ – సమరసింహారెడ్డి – నరసింహనాయుడు – జై సింహా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక బాలయ్య ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తన కెరీర్లో 107వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు జై బాలయ్య లేదా రెడ్డి గారు అన్న టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య 108వ సినిమా పట్టాలు ఎక్కనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news