Moviesబాల‌య్య ముందు దిల్ రాజు కుప్పిగంతులు చెల్ల‌లేదా... మామూలు షాక్ ఇవ్వ‌లేదుగా...!

బాల‌య్య ముందు దిల్ రాజు కుప్పిగంతులు చెల్ల‌లేదా… మామూలు షాక్ ఇవ్వ‌లేదుగా…!

టాలీవుడ్ లో వరుస సూపర్ డూపర్ హిట్లతో దూసుకుపోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటికే ఆరు వరుస సూపర్ డూపర్ హిట్ల‌తో డబుల్ హ్యాట్రిక్ హిట్లు కొట్టేశారు. ఆయన తొలి సినిమా నుంచి తాజాగా వచ్చిన ఎఫ్3 సినిమా వరకు అన్ని హిట్ సినిమాలు. అయితే ఈ ఆరు హిట్ సినిమాలలోనూ నిర్మాత దిల్ రాజుకు సంబంధం ఉంది. పటాస్ సినిమా వదిలేస్తే మిగిలిన ఐదు సినిమాలకు నిర్మాత దిల్ రాజు. అయితే పటాస్ సినిమాను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇలా చూస్తే అనిల్ రావు పూడి కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటివరకు రాజు ఆయనకు మధ్య మంచి లింకు ఉంది.

అయితే ఇప్పుడు అనిల్ రావుపూడి తాజాగా బాలయ్యతో తీస్తున్న సినిమాతో మాత్రం వీరిద్దరి లింక్ కట్ అయిపోయింది. అనిల్ రవిపూడి బాలయ్య సినిమాకు దిల్ రాజుకు ఎలాంటి సంబంధం లేకుండా పోయింది. బాలయ్యతో అనిల్ రావిపూడి తీస్తున్న సినిమాను షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తోంది. గారపాటి సాహు – చంటి పెద్ది కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే బాలయ్యతో ఎప్పటినుంచో తన బ్యానర్లో ఒక సినిమా తీయాలని దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నా అది వర్కౌట్ కావడం లేదు. దిల్ రాజు ఎంత పెద్ద నిర్మాత అయినా.. ఆయ‌న ద‌గ్గ‌ర ఎంత‌ బిజినెస్ స్ట్రాటజీ ఉన్నా బాలయ్యతో ఆయనకు మంచి అనుబంధం కావాలని కోరుకుంటున్నాడు.

ఇండస్ట్రీలో బాలయ్యతో బంధం బలంగా ఉంటే అది తనకు ఎంత ఉపయోగపడుతుందో బాగా తెలిసిన వ్యక్తి దిల్ రాజు. అందుకే తన బ్యానర్ లో బాలయ్య హీరోగా ఒక సినిమా తీయాలని అనుకుంటూ… ఐదు, ఆరు సంవత్సరాలుగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న కుదరటం లేదు. తాజాగా అనిల్ రావిపూడి – బాలయ్య సినిమాను తన బ్యానర్ లోనే తీయాలని కూడా దిల్ రాజు అనుకున్నారు. ఎలాగైనా బాలయ్య – అనిల్ రావిపూడి సినిమాలో తాను నిర్మాణ భాగస్వామిగా దూరాలని రాజు ప్రయత్నాలు చేశారన్న గుసగుసలు వినిపించాయి.

అయితే రాజు ఈ సినిమాలో పార్ట్‌న‌ర్ గా చేరితే ఆయనదే పై చేయి అవుతుందని… అంతా ఆయన చెప్పినట్టే వినాల్సి వస్తుందని నిర్మాతలు అందుకు ఒప్పుకోలేదట. రాజు ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయితే తాము డమ్మీ అయ్యే అవకాశం ఉందని వాళ్లే రాజును మెల్లగా సైడ్ చేసేసారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అందుకే తాజాగా ఎననౌన్స్‌ చేసిన సినిమాలో కేవలం షైన్ స్క్రీన్ మాత్రమే ఈ ప్రాజెక్టును నిర్మిస్తుందని క్లారిటీ ఇచ్చేశారు. అనిల్ రావిపూడి ద్వారా దిల్ రాజు ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ అయ్యేందుకు చివరి క్షణం వరకు గట్టిగా ప్రయత్నాలు చేశారని తెలిసింది.

అఖండ తర్వాత బాలయ్యతో అంతే పవర్ఫుల్ హిట్ సినిమా తీయాలని దిల్ రాజు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాలు ఎప్పటికప్పుడు బెడిసి కొడుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దిల్ రాజు గురించి తెలిసిన బాలయ్య కూడా ఆయన బ్యానర్లో సినిమాలో నటించేందుకు అంత ఆసక్తితో లేరని తెలుస్తోంది. అందుకే రాజు చేసిన తాజా ప్రయత్నాలకు బాలయ్య కూడా అడ్డు తగిలినట్టు బోగట్టా..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news