Moviesసన్నీ లియోన్ ఎవరో తెలియకుండానే ఆ హీరోలు బుక్ చేసుకున్నారా..?

సన్నీ లియోన్ ఎవరో తెలియకుండానే ఆ హీరోలు బుక్ చేసుకున్నారా..?

సన్నీ లియోన్ గురించి కాస్త ఊహ తెలిసిన ఏ పిల్లలైనా చెప్పేస్తారు. శృంగార తారగా పాపులర్ అయిన సన్నీ..ఇంట్లో పరిస్థితుల కారణంగానే ఆమె ఈ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ప్రారంభంలో ఇలాంటి నీలి చిత్రాలలో నటిస్తుందని తెలిసి ఆమె బంధువులందరూ అసహ్యించుకున్నారు. అప్పటి వరకూ ఉన్న పోర్న్ స్టార్స్ అందరినీ సన్నీ వెనక్కి నెట్టింది. శృంగార తారగా 16 ఏళ్ళకే కెరీర్ ప్రారంభించి డేనియల్ వెబ‌ర్‌తో ఎన్నో నీలి చిత్రాలు చేసింది. ఓ పెద్ద స్టార్ హీరోకి వచ్చినంత క్రేజ్ సన్నీకి దక్కింది.

అయితే, కొంతకాలం తర్వాత ఆమె ఆ ఫీల్డ్ ని వదిలేసి కమర్షియల్ సినిమాలలో నటించాలని ఆశపడింది. ఆ సమయంలో బాలీవుడ్ మేకర్స్ అలాగే, అక్కడ స్టార్ హీరోలు బాగా సపోర్ట్ చేశారు. ఇక్కడ రొమాంటిక్ సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంది. సన్నీకి ఉన్న క్రేజ్‌ను బాలీవుడ్ మేకర్స్ బాగానే వాడుకుంటున్నారు. ఒక్క సాంగ్ చేసినా తమ సినిమా హిట్ అనే మైండ్ సెంట్‌తో పక్కా బిజినెస్ పరంగా ఆలోచించి సన్నీతో ఐటెం సాంగ్స్ చేయించారు.

అదే సమయంలో సన్నీని టాలీవుడ్‌కి తీసుకురావాలని మంచు హీరో మనోజ్ అనుకున్నారు. ఆయన నటించిన కరెంట్ తీగ సినిమాలో సన్నీని తీసుకున్నారు. జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా వచ్చిన ఈ సినిమాలో సన్నీ టీజర్ పాత్రలో నటించింది. ఆమెకి తగ్గట్టే అన్నీ డబుల్ మీనింగ్ డైలాగులను రాశారు. చివరికి సంపూతో జంపయ్యే పాత్రను సన్నీ బాగానే చేసి ఆకట్టుకుంది. అయితే, ఈ సినిమా రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఆ సందర్భంగా సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు సన్నీ లియోన్ ఎవరో తెలియదన్నారు. ఈ సినిమాతోనే ఆమెను చూశానని చక్కగా నటించిందని.. కరెంట్ తీగ సినిమా తర్వాత తనకి మరిన్ని అవకాశాలు తెలుగులో వస్తాయని విష్ చేశారు. ఇప్పుడు అదే స‌న్నీ మ‌రి మంచు విష్ణు జిన్నా సినిమాలో చేస్తోంది. మొన్నామ‌ధ్య మోహ‌న్‌బాబు ఆమె చేయి ప‌ట్టుకుని మ‌రీ త‌న యూనివ‌ర్సిటీ స్టూడెంట్స్‌కు ప‌రిచ‌యం చేశారు. అయితే అప్ప‌ట్లో సన్నీ లియోన్ ఎవరో తెలియదనడమే పెద్ద కామెడీ. నిజంగా సన్నీ శృంగారతార అని తెలియదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ కూడా చేశారు. చెవిలో పువ్వు పెట్టొచ్చుగానీ, మరీ కాలీ ఫ్లవర్ పెడితే తెలిసిపోతుంది కదా మరి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news