Moviesగోవా బ్యూటీ ఇలియానా ఆ టాలీవుడ్ హీరో వల్ల మోసపోయిందా.. !

గోవా బ్యూటీ ఇలియానా ఆ టాలీవుడ్ హీరో వల్ల మోసపోయిందా.. !

గోవా బ్యూటీ ఇలియానా డిక్రూజ్ టాలీవుడ్ కి దేవదాసు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఏకంగా పూరి జగన్నాథ్ – సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి సినిమాలో నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగులో అతికొద్దికాలంలో కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్‌గా ఇలియానా పేరు అప్పట్లో మార్మోగిపోయింది. బక్క పలచని పర్సనాలిటీతో ఇల్లూ బేబీ వరుస సినిమాలతో క్రేజీ హీరోయిన్‌గా వెలిగింది.

ప్రభాస్, మహేశ్ బాబు, ఎన్.టి.ఆర్, రవితేజ, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్..ఇలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి హిట్స్ అందుకుంది. ఇల్లీ బేబీ బెల్లీ డాన్స్‌లో పాపులర్. తన బాడీ పార్ట్స్‌లో ఏది మీకు బాగా ఇష్టము అంటే..నా నడుము అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంతేకాదు..బెల్లీ డాన్స్ చేయడం అంటే బాగా ఊపొస్తుంది అని కూడా చెప్పింది. ఏ సినిమా చేసిన ఒక్క సాంగ్‌లో అయినా ఇలియానా బెల్లీ డాన్స్‌తో అదరగొడుతుంది.

ఇక ఇలియానా తెలుగులో ఎక్కువ సినిమాలు చేసిందీ అంటే పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే. పోకిరి, నేను నా రాక్షసి, దేవుడు చేసిన మనుషులు.. ఇలా పూరితో సినిమాలు చేసింది. ముఖ్యంగా రానా హీరోగా పూరి దర్శకత్వంలో వచ్చిన నేను నా రాక్షసి ఇలియానాకి మరిచిపోని సంఘటనలు ఎన్నో ఇచ్చిందని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. ఈ మూవీ సమయంలోనే రానా – ఇలియానా ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి.

ఇలియానాని రానా గాఢంగా ప్రేమిస్తున్నారని త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలలో జనాలలో హాట్ హాట్‌గా చర్చలు సాగాయి. కానీ, అది మధ్యలోనే బ్రేక్ అయింది. ఇలియానా కూడా ఓ సందర్భంలో టాలీవుడ్ హీరోలపై ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్స్ చేసింది. ఇక్కడ హీరోయిన్స్‌ని వాడుకొని వదిలేస్తారని చురకలంటించింది. ఇలా అనడానికి కారణం ఇక్కడ హీరో చేతిలో మోసపోవడమే అని ఇటీవల కూడా టాక్ వినిపించింది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని, ఇలియానా – రానా మాత్రం ఓ దశలో బాగా వార్తల్లో నిలిచారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news