Moviesఓరి నాయనో..రాజమౌళి మనసులో అలాంటి కోరికలు ఉన్నాయా..? అస్సలు ఊహించలేదుగా..!!

ఓరి నాయనో..రాజమౌళి మనసులో అలాంటి కోరికలు ఉన్నాయా..? అస్సలు ఊహించలేదుగా..!!

రాజమౌళి ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన పేరుకు పరిచయాలు చేయాల్సిన పని లేకుండా చేసుకున్న దర్శకధీరుడే ఈ జక్కన్న. సినీ ఇండస్ట్రీలో రాజమౌళి అంటే ఓ సంచలనం. ఓ ప్రభంజనం. ఓ బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలలో ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వలేదంటే.. ఆయన రేంజ్ అయిన పర్ఫామెన్స్.. ఆయన డెడికేషన్.. ఓ సినిమాపై ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి కెరియర్ లో అన్ని బ్లాక్ బస్టర్ హిట్ మూవీలే. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాస్టింగ్ రికార్డులు కలెక్ట్ చేసింది.

రాజమౌళి టాప్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ తో కూడా రాజమౌళి ఇండస్ట్రీ లెక్కలు మార్చేశాడు. కనీ విని ఎరుగని కలెక్షన్స్ సాధించి.. ఇద్దరు బడా హీరోలతో కలిసి ఆర్ఆర్ఆర్ అనే ప్రభంజనం సృష్టించారు. ఈ సినిమా సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది . అయితే చాలా వరకు ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోలు రాజమౌళితో ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా ..అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి అవకాశం వస్తే ఎవ్వరూ వదులుకోరు.

కానీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఆయన డైరెక్షన్ లో నటించాలని ఆశపడుతున్న క్రమంలో.. దర్శకధీరుడు రాజమౌళి మాత్రం లెజెండ్ హీరోని డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నాడట. రీసెంట్ గా పాల్గొన్న ఇంటర్వ్యూలు ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పేసాడు రాజమౌళి. బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…” రజనీకాంత్ సినిమాకు డైరెక్ట్ చేయాలని ఉంది” అంటూ తన మనసులోని కోరికను వెల్లడించారు.

అయితే రాజమౌళి అడిగితే రజినీకాంత్ డేట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారని.. రాజమౌళి రజనీకాంత్ మల్టీ స్టార్ సినిమాలు ప్లాన్ చేస్తే బాగుంటుందని నెటిజన్స్ కోరుకుంటున్నారు. కానీ ఇది వర్కౌట్ అవ్వని విషయం అని మనకు తెలిసిందే. రజినీకాంత్ వయసు దృష్ట్యా రాజమౌళి ఓ సినిమాకి తీసుకునే సమయం ఎలా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. ఇవన్ని ఆలోచిస్తే సినిమా సెట్ అవ్వడం కష్టం. అయితే రాజమౌళి బలంగా అనుకుంటే అది ఎంత సేపు చెప్పండి. మరి చూడాలి సినీ ఇండస్ట్రీ అంటేనే మాయలోకం ఏం జరుగుతుందో తెలియదు రాజమౌళి డైరెక్షన్లో రజనీకాంత్ సినిమా వస్తే బాక్సులు బద్దలు ఇవ్వాల్సిందే అంటున్నారు అభిమానులు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో..????

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news