Moviesక‌ళ్లుచెదిరేలా ' బింబిసార ' నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్‌... క‌ళ్యాణ్‌రామ్ గ‌ల్లా...

క‌ళ్లుచెదిరేలా ‘ బింబిసార ‘ నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్‌… క‌ళ్యాణ్‌రామ్ గ‌ల్లా పెట్టె గ‌ల‌గ‌లా…!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన తాజా బ్లాక్ బస్టర్ సినిమా బింబిసార‌. గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికే విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకుంది. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన బింబిసార రు. 25 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. పైగా ఈ వీకెండ్‌లో వచ్చిన అమీర్ ఖాన్ – నాగచైతన్య లాల్ సింగ్ చద్దా డిజాస్టర్ టాక్‌ తెచ్చుకుంది. నితిన్ మాచర్ల నియోజకవర్గం కూడా ప్లాప్ టాక్‌ తో రన్ అవుతుంది.

ఈ సమయంలో రెండో వీకెండ్ లో కూడా బింబిసార‌ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర తిరుగులేకుండా ఉంది. ఇప్పటికే థియేటర్ బిజినెస్ పరంగా భారీ లాభాలు చూసిన కళ్యాణ్ రామ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ లోను భారీగా వెనకేసుకోనున్నట్టు తెలుస్తోంది. బింబిసార‌ నాన్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయింది. ఈ మూవీ శాటిలైట్ డిజిటల్ రైట్స్‌ జీ తెలుగు ఛానల్ దక్కించుకుంది. విశ్వ‌స‌నీయ‌ వర్గాల సమాచారం ప్రకారం రు. 20 కోట్ల రూపాయలకు బింబిసార‌ నాన్ థియేటర్ బిజినెస్ లాక్ అయినట్టు తెలుస్తోంది.

కేవలం తెలుగుతో పాటు సౌత్ లాంగ్వేజెస్ మొత్తం ఈ డీల్ లో కలిపి ఉన్నట్టు తెలిసింది. కళ్యాణ్ రామ్ ఈ సినిమాను రు. 37 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. నాన్ థియేట్రికల్ బిజినెస్‌పై నమ్మకంతోనే కళ్యాణ్ డబ్బులు పెట్టారన్న ప్రచారం కూడా జరిగింది. థియేటర్ బిజినెస్‌గా చూస్తే వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాను రు. 15 కోట్లకు రిస్క్ చేసి మ‌రీ అమ్మారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రైట్స్ ను టాప్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సొంతం చేసుకున్నారు.

కేవలం ఫస్ట్ వీక్ లోనే రు. 25 కోట్ల షేర్ రావడంతో ఇప్పటికే రు. 10 కోట్లకు పైగా లాభంతో బింబిసార‌ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ సినిమాకు లాంగ్ ర‌న్‌లో మరో ఏడే ఎనిమిది కోట్ల రూపాయల లాభం వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏదేమైనా బింబిసార సినిమాతో క‌ళ్యాణ్‌రామ్ గ‌ల్లా పెట్టె అయితే గ‌ల‌గల‌లాడ‌డం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news