Moviesసైలెంట్ షాకిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ.. పెళ్లికి సిద్ధమైన ప్రియాంక సింగ్(వీడియో)..!?

సైలెంట్ షాకిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ.. పెళ్లికి సిద్ధమైన ప్రియాంక సింగ్(వీడియో)..!?

యస్ ..తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ,వీడియోలను.. ఆమె తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం బిగ్ షాకింగ్ గా మారింది . మనకు తెలిసిందే ప్రియాంక సింగ్ ట్రాన్స్ జెండర్ అబ్బాయిగా ఉన్న అతడు.. అమ్మాయిగా మారాడు. ఈ స్టోరీ గురించి మనకు తెలిసిందే. మగ దిక్కులేని తన కుటుంబానికి ఆడిదిగా మారి మగదిక్కుగా ఇంట్లో బాగోగులు చూసుకుంటుంది. బిగ్ బాస్ ద్వారా ప్రియాంక సింగ్ ఎంత మంచి పేరు సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

అంతకుముందు జబర్దస్త్ లో చేసిన రాని పాపులారిటీ.. క్రేజ్.. నేమ్.. ఒక్క బిగ్ బాస్ ద్వారా సంపాదించుకున్నిది. ప్రియాంక సింగ్ ఈ షోలో ఆమె ప్రవర్తించిన తీరు..తోటీ కంటెస్టెంట్ మానస్ తో ఆమె నడుచుకున్న విధానం.. ఆమె పెద్దరికంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు.. అందరికీ అన్నం పెట్టిన విధానం చాలామందికి నచ్చింది. కాగా బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక ఆమె పలు ఈవెంట్స్ తో ఫోటోషూట్స్ తో చాలా బిజీగా మారింది. హీరోయిన్ గా రెండు సినిమాల్లో కూడా సైన్ చేసినట్లు తెలుస్తుంది .

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక సింగ్ సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది. ఈ ఛానల్ ద్వారా రోజు తన అభిమానులతో తన ఫూడ్ సీక్రెట్స్.. తన బ్యూటీ సీక్రెట్స్ ని పంచుకుంటూ వచ్చింది. కాగా రీసెంట్ గా తన ఇంస్టాగ్రామ్ లో ప్రియాంక సింగ్ హెల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేసింది. దీంతో ప్రియాంక సింగ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది.

అయితే దీనికి కొద్ది రోజులు ముందే ప్రియాంక సింగ్ తన అమ్మ నాన్నతో కలిసి పూజ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ..” ఇట్స్ డన్.. హ్యాపీ” అంటూ ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ చేసిన కొద్ది రోజుల తర్వాత ప్రియాంక సింగ్ తన ఇంస్టాగ్రామ్ లో హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు దర్శనం ఇవ్వడం ఇప్పుడు అభిమానులకు షాకింగ్ గా ఉంది. అయితే ఇప్పటివరకు ప్రియాంక సింగ్ తాను పెళ్లి చేసుకుంటున్నట్లు ..పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా అయితే ప్రకటించలేదు. కానీ రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే అమ్మడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన్నట్లే అని తెలుస్తుంది. మరి ఇది పెళ్లి కోసమో..? ఫోటోషూట్ కోసమో ..?వేరే పెళ్లిలో అమ్మడు హంగామా కోసమో..? తెలియాలంటే ప్రియాంక సింగ్ నోరు విప్పి చెప్పాల్సిందే. ప్రస్తుతానికైతే అందంగా పసుపు చీరలో రెడీ అయిన ప్రియాంక సింగ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news