MoviesNBK107 లో దిమ్మ‌తిరిగిపోయే ఇంట్రెస్టింగ్ ట్విస్ట్... ఆ స్టార్ హీరో నెగిటివ్...

NBK107 లో దిమ్మ‌తిరిగిపోయే ఇంట్రెస్టింగ్ ట్విస్ట్… ఆ స్టార్ హీరో నెగిటివ్ రోల్‌…!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ అఖండ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో త‌న కొత్త సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం వివిధ ప్రాంతాల్లో శ‌ర‌వేగంగా న‌డుస్తోంది. కొద్ది రోజుల క్రింద‌ట హైద‌రాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్‌.. ఆ త‌ర్వాత క‌ర్నూలులో మ‌రో నాలుగు రోజుల పాటు కీల‌క స‌న్నివేశాలు షూట్ చేశారు.

ఇప్పుడు విదేశాల్లో రెండు పాట‌ల‌ను షూట్ చేస్తున్నారు. ట‌ర్కీలో ఈ రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ ఉంటుంద‌ని.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ సినిమా హైద‌రాబాద్‌కు షిప్ట్ అవుతుంద‌ని.. అక్క‌డ రామోజీ ఫిల్మ్‌సిటీలో కొన్ని కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ ఉంటుంద‌ని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా యూనిట్ వ‌ర్గాల నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ సినిమాలో ఓ ప్ర‌ముఖ హీరో పోషించిన స్పెష‌ల్ పాత్ర ఉంటుంద‌ట‌. ఈ పాత్ర ముందు నుంచి పాజిటివ్‌గా ఉంటూ చివ‌ర్లో ఊహించ‌ని విధంగా నెగ‌టివ్ షేడ్స్‌లోకి మారి ప్రేక్ష‌కుల‌ను పెద్ద షాక్‌కు గురి చేస్తుంద‌ని అంటున్నారు. ఈ ఇంట్ర‌స్టింగ్ ట్విస్ట్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంద‌ని అంటున్నారు. దీంతో అభిమానుల్లో స‌హ‌జంగానే ఆస‌క్తి నెల‌కొంది.

 

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ బాల‌య్య‌కు జోడీగా న‌టిస్తోంది. వరలక్ష్మి శరత్‌కుమార్ లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. వ‌చ్చే డిసెంబ‌ర్ లేదా సంక్రాంతి బ‌రిలో సినిమాను దింపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news