Moviesబాల‌య్య కెరీర్ ఫుల్‌ స్వింగ్ వెన‌క డాట‌ర్ ' తేజ‌స్విని '...

బాల‌య్య కెరీర్ ఫుల్‌ స్వింగ్ వెన‌క డాట‌ర్ ‘ తేజ‌స్విని ‘ క‌ష్టం ఇంత ఉందా…!

ప్రస్తుతం నటి సింహం బాలకృష్ణ కెరియర్ ఎంత జోరు మీద ఉందో చూస్తూనే ఉన్నాం. అఖండ సినిమా అటు వెండితెరను ఊపేయటం.. ఇటు అన్‌స్టాప‌బుల్ ప్రోగ్రాంతో బుల్లితెర షేక్ అయిపోవడం… బాలయ్య ఈ తరం జనరేషన్‌కు ఒక రేంజ్ లో కనెక్ట్ అయిపోవడం చూస్తుంటే బాలయ్య కెరీర్లోనే శిఖరాగ్రంలో ఉన్నట్టు అర్థమవుతుంది. అసలు ఇప్పుడు బాలయ్య లైనప్‌ చూస్తుంటే మామూలుగా లేదు. చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటిస్తున్న జై బాలయ్య సినిమా తర్వాత సూపర్ డూపర్ హిట్ సినిమాల‌ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య 108వ సినిమా తెరకెక్కనుంది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ – బోయపాటి శ్రీను కూడా బాలయ్య లైన్లో ఉన్నారు.

ఒకప్పుడు బాలయ్య సినిమాల డేట్లు, ప్రోగ్రాములు ఎవరికైనా కావాలి అంటే టాలీవుడ్ లో ముందుగా వినిపించే పేరు డాక్టర్ సురేంద్ర. పైగా ఆయన డాక్టర్ కూడా కావడంతో రెగ్యులర్‌గా కూడా ఇండస్ట్రీ వర్గాల్లో మంచి పలుకుబడి ఉండేది. అయితే ఇప్పుడు బాలయ్య సినిమాలు.. డేట్లు, ఇతర వ్యవహారాలు చూసుకోవడంలో మరో పేరు కూడా తెరమీదకు వస్తోంది. గత 7 – 8 నెలలుగా ఆ పేరు టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్‌లో బాగా వైరల్ అవుతుంది. ఆ పేరు ఎవరిదో కాదు బాలయ్య రెండో కుమార్తె తేజస్విని.

గత ఏడాదికాలంగా ఆమె తండ్రి వ్యవహారాలు చూస్తున్నారని తెలుస్తోంది. తన తండ్రి గెటప్పులతో పాటు కాస్ట్యూమ్స్, సినిమాల లైన్లు ఇలా అన్నింటి మీద కూడా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అలాగే తరచూ సెట్స్ లోకి కూడా వస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో బాలయ్య ఇతర వ్యవహారాలు ఎవరు చూసినా ఆర్థిక వ్యవహారాలు అన్ని ఆయన అర్ధాంగిని వసుంధ‌ర‌ చూసుకునేవారు. అయితే ఇప్పుడు బాలయ్య ఆర్థిక వ్యవహారాలు కూడా ఆయన చిన్న కుమార్తె తేజస్విని చూస్తున్నారట. బాలయ్య స్వయంగా తేజస్వినికి అన్ని వ్యవహారాలు అప్పగించినట్లు తెలుస్తోంది.

ఇక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్ లో సరదాగా ఎప్పుడైనా సిగరెట్ తాగే అలవాటు ఉన్న బాలయ్య… ఇప్పుడు దానిని కూడా పక్కన పెట్టేసారన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒకప్పుడు కాస్త కోపంగా ఉండే బాలయ్యలో ఇంత మార్పు రావడం వెనక తేజస్విని తెరవెనక ప్లానింగ్ చాలానే ఉందని అంటున్నారు. ఏదేమైనా బాలయ్య తన పిల్లలను చాలా క్రమశిక్షణతో పెంచారు అన్నది ఇండస్ట్రీ వర్గాల వారందరికీ తెలుసు.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వారసులు ఎవరు ఆయన రాజకీయ, సినిమా వ్యవహారాల్లో జోక్యం చేసుకునేవారు కాదు. బాల‌య్య పెద్ద కుమార్తె బ్రాహ్మ‌ణి హెరిటేజ్ వ్య‌వ‌హారాల్లో త‌ప్పా మ‌రెక్క‌డా క‌నిపించ‌రు. ఇప్పుడు చిన్న‌మ్మాయి ఏకంగా తండ్రి వ్య‌వ‌హారాలు చూసుకోవ‌డంతో పాటు ఆయ‌న కెరీర్ ఇంత ప‌గ‌డ్బందీగా ప్లాన్ చేస్తుండడం విశేషం.

Latest news