Moviesతొడ‌లు చూపించ‌న‌న్న రాశి... అదే అన‌సూయ‌కు క‌లిసొచ్చింది..!

తొడ‌లు చూపించ‌న‌న్న రాశి… అదే అన‌సూయ‌కు క‌లిసొచ్చింది..!

రాశి..సీనియర్ హీరోయిన్‌గా ఎంత పాపులర్ అయ్యారో అందరికీ తెలిసిందే. శుభాకాంక్షలు, పెళ్ళి పందిరి, మనసిచ్చిచూడు, గోకులంలో సీత లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్‌గా నటించి క్రేజీ హీరోయిన్‌గా ఒక దశలో ఓ వెలుగు వెలిగింది. తెలుగుతో పాటు ఇతర సౌత్ భాషలలోనూ రాశి అందాలు ఆరబోసింది. అగ్ర దర్శకులతో పనిచేసిన రాశి.. ఒకవైపు కుటుంబ కథా చిత్రాలను చేస్తూనే గ్లామర్ రోల్స్ కూడా అల్లాడించింది.

 ఇక రాశి హీరోయిన్‌గా చేస్తూనే వెంకటేశ్ లాంటి సీనియర్ హీరో నటించిన శీను లాంటి సినిమాలలో ఐటెం నంబర్స్ కూడా చేసింది. వెంకటేశ్ సరసన హీరోయిన్‌గా అవకాశం వస్తుందని ఎదురుచూసిన రాశి..శీను సినిమాలో సాంగ్ చేసే అవకాశం వస్తే వదులుకోకుండా చేసింది. అలాగే, రవితేజ నటించిన వెంకీ సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసి మాస్ ఆడియన్స్‌ని ఒక కుదుపు కుదిపింది. ఇలా ఐటెం సాంగ్స్ మాత్రమే కాదు, నిజం లాంటి సినిమాలో గోపీచంద్ సరసన నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కూడా నటించి మెప్పించింది.

ఇలా ఎలాంటి పాత్రనైనా న్యాయం చేయగల రాశి స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ రంగస్థలం సినిమాలో అద్భుతమైన అవకాశం వస్తే మాత్రం నిర్మొహమాటంగా నో చెప్పింది. ఈ సినిమాలో అనసూయ‌ పోషించిన రంగమ్మత్త పాత్రకు సుక్కూ ముందు రాశిని అనుకున్నారు. కథ, పాత్ర చెప్పారు. అయితే, పాత్ర స్వభావం కోసం మోకాళ్లపైకి చీర కట్టుకోవాలి..మందు తాగే లాంటి సీన్స్ చేయాలి..అని సన్నివేశలను చెప్పగానే రాశి నో అన్నది.

స్వయంగా ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది. అలా మోకాళ్లపైకి తొడ‌లు క‌న‌ప‌డేలా చీర కట్టుకోవాలంటే నాకెందుకో ఇబ్బందిగా అనిపించింది. పెద్ద సినిమా అయినా ఆ పాత్రలో నన్ను చూడాలంటే ఆడియన్స్ అంతగా ఇష్టపడరని వదులుకున్నాను. కానీ, ఆ పాత్ర చేసి ఉంటే బావుండేదని తర్వాత అనిపించింది. అయినా అనసూయ చాలా బాగా చేసింది ఆ రోల్ అని మెచ్చుకుంది. నిజంగా ఈ రోల్ రాశి గనక చేసి ఉంటే మరో లెవల్ అని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news