Moviesలేటు వయసులో ఆమని ఆ హీరోకు లిప్ కిస్..ఎందుకు పెట్టిందంటే..?

లేటు వయసులో ఆమని ఆ హీరోకు లిప్ కిస్..ఎందుకు పెట్టిందంటే..?

చాలామంది హీరోయిన్స్ యంగ్ ఏజ్ లో ఉండగానే హీరోలతో రొమాన్స్ చేయడానికి రెడీ అంటారు తప్ప..పెళ్ళై..మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఇలాంటి వాటికి ఎంతమాత్రం ఒప్పుకోరు. అసలు మేకర్స్ కూడా ఆ విషయంలో సీనియర్ హీరోయిన్‌ని అడగాలంటే ధైర్యం చేయరు. కానీ, ఆమని మాత్రం సీనియర్ నటుడుకి పెదవి ముద్దు పెట్టాల్సి ఉంటుందీ అంటే ఒక్క క్షణం ఆలోచించ కుండా సై అనేసింది. ఆమనికి తెలుగు, తమిళ సినిమాలలో హీరోయిన్‌గా మంచి క్రేజ్ ఉండేది.

ప్రముఖ టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన కామెడీ ఎంటర్‌టైనర్ జంబలకిడిపంబ సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో ఆమని నరేష్ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమని తెలుగులో ఒక వెలుగు వెలిగింది. ముఖ్యంగా సీనియర్ దర్శకులు బాపు – రమణలు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమని.. ఈసినిమాకి జాతీయ సినిమా అవార్డు దక్కించుకుంది.

ఆ సినిమాలో నటనకు గాను ఆమెకి ఉత్తమ నటిగా నంది బహుమతిని అందుకుంది. తమిళ సినిమా నిర్మాత అయిన ఖాజా మొహియుద్దీన్ ని పెళ్ళి చేసుకున్న ఆమని అందరిలాగే సినిమా రంగానికి దూరంగా ఉంది. కొన్నేళ్ళ తర్వాత సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన మధ్యాహాన్నం హత్య మూవీతో మళ్ళీఇ రీ రంట్రీ ఇచ్చింది. దీనికి కారణం కొంత ఆర్థిక ఇబ్బందులే.. అని అప్పట్లో ప్రచారం జరిగింది.

రీ ఎంట్రీ తర్వాత నటించిన సినిమాలలో అమ్మ అత్త పాత్రలలో బాగా ఆకట్టుకుంటోంది. అలాగే డైలీ సీరియల్స్‌లోనూ నటిస్తోంది. అయితే, ఇంత ఏజ్ వచ్చినా కూడా ఆమని సీనియర్ నటుడు నరేష్ కి పెదవి ముద్దు పెడుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. చందమామ కథలు అనే సినిమాలో నరేష్ – ఆమని కలిసి నటించారు. సందర్భానుసారం ఓ సీన్‌లో ఆమనికి నరేష్ ముద్దు పెట్టాల్సి ఉంటుంది.

ఈ సన్నివేశం గురించి దర్శకుడు చెప్పగానే ఆమని ఏమీ ఆలోచించకుండా ఒకే చెప్పింది. ఇలా ఎందుకు అంటే ఇద్దరి మధ్య ఉన్న అనుబంధమే. ఆ మాటే ఆమని ని అడిగితే చెప్పింది. ఇది అప్పట్లో హాట్ టాపిక్ అయింది కూడా. మిగతా సీనియర్ హీరోయిన్స్ కూడా ఆమని మాదిరిగా సహకరిస్తే తెరపై మరికొందరి సీనియర్ నటుల ముద్దులను చూడొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news