Moviesప్ర‌భాస్ - ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తోందెవ‌రు.. ఆ స్కెచ్ ఇదే...!

ప్ర‌భాస్ – ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తోందెవ‌రు.. ఆ స్కెచ్ ఇదే…!

కొన్ని కాంబినేష‌న్ల‌లో సినిమాలు వ‌స్తే ప్రేక్ష‌కులు అంద‌రూ షాక్ అవుతారు. అస‌లు అసాధ్యం అనుకున్న కాంబినేష‌న్లు నిజంగానే సెట్ అయితే అంత‌కుమించిన ఆనందం ఏం ఉంటుంది. అస‌లు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో ఎవ‌రైనా సినిమా ఊహించామా ? అలాంటిది ఆ కాంబినేష‌న్లోనే సినిమా సుసాధ్యం చేసి చూపించాడు రాజ‌మౌళి. ఎన్టీఆర్ – రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో వ‌చ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్లో ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసింది.

ఇక ఇప్పుడు ప్ర‌భాస్ – ఎన్టీఆర్ కాంబినేష‌న్లో మ‌ల్టీస్టార‌ర్ సినిమా వ‌స్తే ఎలా ? ఉంటుంది. అస‌లు విన‌డానికే మ‌తులు పోయేలా ఉంది. ఇది నిజ‌మైతే అంత‌కు మించిన ఆనందం ఏం ఉంటుంది. టాలీవుడ్‌లోనే త్రిబుల్ ఆర్ కాంబినేష‌న్‌ను మించిన కాంబినేష‌న‌ల్‌గా రికార్డుల‌కు ఎక్కుతుంది. అయితే ఇప్పుడు ఈ కాంబినేష‌న్‌ను సెట్ చేసే ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయ్‌.

బాలీవుడ్ అగ్ర‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఈ ఇద్ద‌రు హీరోల కాంబినేష‌న్లో మ‌ల్టీస్టార‌ర్ సెట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌ముఖ సినిమా ఎన‌లిస్ట్ ఉమైర్ సంధు ఈ విష‌యాన్ని లీక్ చేశాడు. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌లో మాత్ర‌మే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా ఈ క్రేజీ కాంబినేష‌న్ గురించే చర్చ జ‌రుగుతోంది. బాహుబ‌లి సీరిస్‌, సాహో సినిమాలతో పాటు ఇప్పుడు న‌టిస్తోన్న స‌లార్‌, ప్రాజెక్ట్ కే సినిమాల‌తో దేశ‌వ్యాప్తంగానే ప్ర‌భాస్ పేరు మార్మోగుతోంది.

అటు ఆరు వ‌రుస హిట్ల‌తో తిరుగులేని ఫామ్‌లో ఉన్న ఎన్టీఆర్ తాజాగా త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవ‌ల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అరివీర భ‌యంక‌ర న‌ట‌న‌కు నార్త్ మాస్ ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ కొర‌టాల శివ సినిమా చేస్తున్నాడు. ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ సినిమా ఉంది. ప్ర‌భాస్ కూడా ప్ర‌శాంత్ నీల్ తీస్తున్న స‌లార్ త‌ర్వాత స్పిరిట్‌, ప్రాజెక్ట్ కేలో బిజీ కానున్నాడు.

మ‌రి ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్‌కు ద‌ర్శ‌కుడు ? ఎవ‌రు.. ఎప్పుడు ఉంటుంది ? అనేది స్వ‌యంగా నిర్మాత క‌ర‌ణ్ జోహార్ క్లారిటీ ఇస్తే ఈ ఇద్ద‌రు హీరోల అభిమానులే కాదు.. ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు వ‌స్తుందా ? అని అప్‌డేట్స్‌తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news