Moviesటాలీవుడ్ హీరో, హీరోయిన్ స‌హ‌జీవ‌నం.. రెండో పెళ్లికి రెడీ అవుతున్నారా..?

టాలీవుడ్ హీరో, హీరోయిన్ స‌హ‌జీవ‌నం.. రెండో పెళ్లికి రెడీ అవుతున్నారా..?

ఇటీవ‌ల ఇండ‌స్ట్రీలో ప్రేమ‌లు, పెళ్లిళ్లు బ్రేక‌ప్‌లు కామ‌న్ అయిపోతున్నాయి. ఇక పార్ట్‌న‌ర్స్‌తో విడిపోయిన జంట‌లు కూడా పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డుతున్నాయి. కొత్త తోడు వెతుక్కుంటున్నాయి. ఈ జాబితాలోనే ఇప్పుడు ఓ ఇంట్ర‌స్టింగ్ ప్రేమ‌క‌థ‌పై ఆస‌క్తిక‌ర వార్త ఫిల్మ్‌న‌గ‌ర్లో వినిపిస్తోంది. ఇప్ప‌టికే పెళ్ల‌య్యి పిల్ల‌లు పుట్టి భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేసిన ఓ హీరోయిన్‌… అలాగే ఎప్పుడో పెళ్ల‌యిపోయి ఓ బిడ్డ పుట్టాక భార్య‌కు విడాకులు ఇచ్చిన మ‌రో హీరో క‌లిసి ఇప్పుడు స‌రికొత్త ప్రేమ జ‌ర్నీ స్టార్ట్ చేశార‌ట‌.

బొమ్మరిల్లుతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన హీరో సిద్ధార్థ్.. ఇటీవల కాలంలో సినిమాలతో కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే కొంద‌రు హీరోయిన్ల‌తో ప్రేమాయ‌ణాలు న‌డిపిన సిద్ధార్థ్ ఇప్పుడు స‌రికొత్త తోడు కోసం మ‌రో హీరోయిన్‌ను ప‌ట్టాడ‌ని అంటున్నారు. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు మ‌న హైదారాబాదీ అమ్మాయి అదితి రావ్ హైదరీ.

సిద్ధార్థ్ – అదితి క‌లిసి మ‌హాస‌ముద్రం సినిమాలో న‌టించారు. ఈ సినిమా టైంలోనే ఇద్ద‌రి మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఏర్ప‌డ‌డంతో … సినిమా ప్లాప్ అయినా ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం అయితే పెరిగింద‌ని అంటున్నారు. ప్రస్తుతం ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని రూమర్లు అయితే గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల సిద్ధార్థ్ ముంబైలో అదితి ఇంటికి వెళుతూ కెమేరాల‌కు దొరికిపోయాడు.

 

ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయ్యాయి. ఆ త‌ర్వాత కూడా వీరు ప‌లుమార్లు క‌లిసి క‌న‌ప‌డ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తోంద‌న్న గుస‌గుస‌లు అయితే గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. ఇద్ద‌రు పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న వీరు త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకోవ‌చ్చ‌ని అంటున్నారు. ఇక సిద్ధార్థ్‌కు బాయ్స్ సినిమా టైంకే పెళ్లియి ఓ బిడ్డ కూడా పుట్టాడు. నాలుగేళ్ల‌కే భార్య‌కు విడాకులు ఇచ్చేశాడు.

త‌ర్వాత శృతీహాస‌న్‌, స‌మంత‌తో కూడా డేటింగ్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత‌ బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్‌తో కూడా డేటింగ్ చేసినా ఆమెతో ప్రేమ‌ను కూడా ముగించేశాడు. ఇక హీరోయిన్ అదితి 21 ఏళ్ల‌కే చిన్న వ‌య‌స్సులోనే స‌త్య‌దీప్ మిశ్రా అనే బాలీవుడ్ న‌టుడిని పెళ్లాడింది. ఓ బాబు పుట్టాక ఐదేళ్ల‌కే వీరు విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత ఆమె సినిమాల్లోకి వ‌చ్చి స‌క్సెస్ అయ్యింది. మ‌రి ఇప్పుడు సిద్ధార్థ్‌తో క‌లిసి కొత్త జ‌ర్నీ స్టార్ట్ చేస్తోంది. ఈ కొత్త జ‌ర్నీలో అయినా ఆమె స‌క్సెస్ అవుతుందా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news