Moviesఎన్టీఆర్ - నాగార్జున కాంబినేష‌న్ అలా మిస్ అయ్యిందా...!

ఎన్టీఆర్ – నాగార్జున కాంబినేష‌న్ అలా మిస్ అయ్యిందా…!

టాలీవుడ్‌లో దివంగ‌త విశ్వ‌విఖ్యాత న‌టుడు నంద‌మూరి తార‌క రామారావుతో న‌టించాల‌ని అప్ప‌ట్లో ఎంతోమందికి కోరిక ఉండేది. ఎన్టీఆర్‌కు జోడీగా న‌టించిన వారు తృప్తిప‌డితే.. న‌టించే ఛాన్స్ ద‌క్క‌ని నాటి త‌రం న‌టులు ఎంతో బాధ‌ప‌డేవారు. నాటి త‌రం స్టార్ హీరోల్లో కృష్ణ‌, ఏఎన్నార్, ప్ర‌భాక‌ర్‌రెడ్డి, రావుగోపాల‌రావుతో పాటు స్టార్ హీరోయిన్లు కూడా ఎన్టీర్‌కు జోడీగా న‌టించారు. ఎన్టీఆర్ త‌ర్వాత త‌రం స్టార్ హీరోల్లో చిరంజీవి, బాల‌కృష్ణ ఎన్టీఆర్ సినిమాల్లో న‌టించారు. చిరంజీవి కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తిరుగులేని మ‌నిషి సినిమాలో ఎన్టీఆర్‌కు బావ‌మ‌రిదిగా న‌టించారు.

ఇక బాల‌య్య అయితే ఎన్టీఆర్‌తో క‌లిసి ఎన్నో సినిమాల్లో న‌టించారు. త‌న తండ్రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆరు సినిమాల్లో న‌టించిన బాల‌య్య తండ్రితో క‌లిసి పౌరాణిక‌, సాంఘీక సినిమాల్లోనూ క‌నిపించారు. అయితే నాగార్జున‌, వెంక‌టేష్‌కు మాత్రం ఎన్టీఆర్‌తో న‌టించే ఛాన్స్ రాలేదు. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తు వీరిద్ద‌రితోనూ ఎన్టీఆర్‌కు న‌టించే ఛాన్స్ వ‌చ్చినా తృటిలో మిస్ అయిపోయింది.

వెంక‌టేష్‌తో సినిమా చేయాల‌ని ఎన్టీఆరే స్వ‌యంగా అనుకున్నారు. రామానాయుడు సురేష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్లో ఎన్టీఆర్ హీరోగా ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే బాల‌య్య వందో సినిమాగా న‌టించిన గౌతమీపుత్ర శాత‌క‌ర్ణి సినిమానే ఎన్టీఆర్ గ‌తంలో తీయాల‌ని అనుకున్నారు. ఎన్టీఆర్ శాత‌క‌ర్ణి పాత్ర.. వెంక‌టేష్‌ను పులోమావిగా పెట్టాల‌ని అనుకున్నారు. ఎన్టీఆర్ అడిగిన వెంట‌నే వెంక‌టేష్ కూడా ఓకే చెప్పారు. త‌ర్వాత ఎన్టీఆర్ 1994 ఎన్నిక‌ల‌కు ముందు బిజీ అవ్వ‌డంతో వెంకీ – ఎన్టీఆర్ కాంబినేష‌న్ మిస్ అయ్యింది.

ఇక నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ కూడా ఇలాగే ప‌ట్టాలు ఎక్క‌లేదు. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేముందు ఏఎన్నార్‌ను పిలిచి స‌ల‌హా అడిగారు. అయితే రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు ఏఎన్నార్ ఇష్ట‌ప‌డ‌లేదు స‌రిక‌దా ? ఎన్టీఆర్‌ను కూడా అదో బుర‌ద వ‌ద్ద‌ని చెప్పారు. అయినా ఎన్టీఆర్ మాత్రం ఏఎన్నార్ మాట తోసిరాజ‌నీ పార్టీ పెట్టి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యాక ఎన్టీఆర్ చేసిన కామెంట్లు ఎన్టీఆర్‌ను ఉద్దేశించిన‌వే అని కొంద‌రు ఎన్టీఆర్‌కు ఎక్కించార‌ట‌. దీంతో వీరి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌ట‌. ఈ విష‌యాన్ని ఏఎన్నారే స్వ‌యంగా చెప్పారు.

ఆ త‌ర్వాత ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యాక ఓ రోజు ఏఎన్నార్‌కు ఫోన్ చేసి బ్ర‌ద‌ర్ ఏదో పొర‌పాటు జ‌రిగింది.. భోజ‌నానికి ర‌మ్మ‌ని ఫ్యామిలీతో స‌హా ఆహ్వానించార‌ట‌. అయితే ఏఎన్నార్ వెళ్ల‌కుండా త‌న భార్య‌ను, కొడుకు నాగార్జున‌ను పంపించార‌ట‌. భోజ‌నం అయిన వెంట‌నే నాగార్జున‌కు, ఏఎన్నార్ స‌తీమ‌ణి అన్న‌పూర్ణ‌మ్మ‌కు బ్ర‌ద‌ర్‌ను ఏమీ మ‌న‌సులో పెట్టుకోవ‌ద్ద‌ని చెప్పండి అని చెప్పి పంపించార‌ట‌.

ఆ త‌ర్వాత 1989 ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్ ఓడిపోయాక ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ఎన్టీఆర్ – నాగార్జున కాంబినేష‌న్లో ఓ సినిమా అనుకున్నార‌ట‌. ఎలాగైనా ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్లో సినిమా చేయాల‌ని రాఘ‌వేంద్రుడు ఎంత ప‌ట్టుబ‌ట్టినా రామారావు కొన్నాళ్లు సినిమాల‌కు దూరంగా ఉండ‌డం.. ఆ త‌ర్వాత ఆయ‌న మ‌ళ్లీ సినిమాలు చేసినా నాగార్జున‌తో సినిమా మాత్రం సెట్ కాలేదు. అదే టైంలో వెంక‌టేష్‌తో చేయాల‌నుకున్న శాత‌క‌ర్ణి కూడా ప‌ట్టాలు ఎక్క‌లేదు. రాఘ‌వేంద్రుడు నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్లో సినిమా మిస్ అవ్వ‌డంతో వెంట‌నే బాల‌య్య‌తో సినిమా చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news