Moviesఒక‌టి రెండు సినిమాల‌కే గుర్తుప‌ట్ట‌ని విధంగా మారిన స్టార్ వార‌సులు...!

ఒక‌టి రెండు సినిమాల‌కే గుర్తుప‌ట్ట‌ని విధంగా మారిన స్టార్ వార‌సులు…!

సాధారణంగా సినిమా వాళ్లంటే ఎప్పుడు మేకప్ లతో, సరైన బాడీ మెయింటైన్ చేస్తూ అద్భుతమైన లుక్స్ తో ఉంటారు. వారిలో ఎలాంటి చేంజ్ వచ్చినా కూడా వారి అభిమానులు తట్టుకోలేరు. కాస్త లావైనా, చిక్కిపోయిన కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఒక రేంజ్ లో జరుగుతుంది. అందుకే సెలబ్రిటీస్ మెయింటెనెన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ హీరోలంతా కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించి ప్రస్తుతం టాలీవుడ్ నుంచి దూరమయ్యారు.

దాంతోపాటు గుర్తుపట్టలేనంత విధంగా కూడా వీరి లుక్స్ మారిపోయాయి. కానీ వీరు ఎప్పటికీ కూడా టాలీవుడ్ కి ఎంతో ఆత్మీయమైన హీరోలనే చెప్పాలి. అలా టాలీవుడ్ లో నటించి గుర్తు పట్టని విధంగా మారిపోయిన ఆ సెలబ్రిటీస్ ఎవరో ఇప్పుడు ఈ  ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

జయసుధ కుమారుడు హీరో శ్రేయాన్ :
2015లో బస్తీ అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు వాస్తవంగా జయసుధ లాగానే అద్భుతమైన లుక్స్ ఉన్న శ్రేయాన్ ఇండస్ట్రీలో రాణించలేకపోయాడు ఆ తర్వాత పెళ్లి చేసుకుని బిజినెస్ వైపు అడుగులు వేశాడు. కానీ కేవలం ఐదు, ఆరేళ్లలోనే గుర్తుపట్టలేనంత విధంగా మారిపోయాడు. ఇటీవల తన తల్లితో కలిసి మీడియా కంటపడ్డ శ్రేయాన్ ని పోల్చుకోవడానికి చాలా సమయం పట్టింది అంటే నమ్మండి.

అనిల్ మేక :
ఈ పేరు చెప్తే ఇట్టే గుర్తు రాకపోవచ్చు కానీ హీరో శ్రీకాంత్ తమ్ముడు అనిల్ అంటే మాత్రం అందరికీ గుర్తొస్తుంది. ఎందుకంటే చెప్పమ్మా అనే ఒక అద్భుతమైన సినిమాలో నటించాడు హీరోగా అనిల్ మేక. ఈ చిత్రంలో శ్రీదేవి అక్క కూతురు మహేశ్వరి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా యావరేజ్ గా ఆడడంతో అనిల్ మేక హీరో కెరియర్ కూడా ఫుల్ స్టాప్ పడింది. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి తన అన్న శ్రీకాంత్ హీరోగా విరోధి అనే సినిమా 2011లో తీయగా అది కూడా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి దూరం అయిపోయాడు అనిల్. ఈ మధ్యకాలంలో అనిల్ మా ఎలక్షన్స్ లో ఓటు వేయడానికి రా రావడంతో అతని లుక్ చూసి అందరూ షాక్ అయ్యారు. తమ అభిమాన హీరో ఇలా అయ్యాడు ఏంటి అని అంతా అనుకున్నారు.

నవీన్ విజయ్ కృష్ణ :
విజయ నిర్మల మనవడు అలాగే నటుడు నరేష్ కుమారుడైన నవీన్ హీరోగా రాణించాలని 2015లో అయినా ఇష్టం నువ్వంటే అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఎంతో అద్భుతమైన లుక్స్ ఉన్న నటుడు. అయిన కూడా అతి తక్కువ కాలంలోనే గుర్తుపట్టని విధంగా మారాడు. ఊరంతా అనుకుంటున్నారు, నందిని నర్సింగ్ హోమ్, రెండు జెళ్ళ సీత వంటి మరో మూడు సినిమాల్లో హీరోగా నటించి తన హీరో కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసాడు. ఈ సినిమా లేవి న‌రేష్‌కు క‌లిసి రాలేదు. ప్రస్తుతం బాగా లావైపోయి గుర్తుపట్టడానికి కష్టంగా ఉంది నవీన్ పరిస్థితి. బ‌ల‌మైన బ్యాక్‌గ్రౌండ్ ఉండి కూడా ఈ స్టార్స్ వార‌సులు హీరోలుగా రాణించ‌లేక ఒక‌టి రెండు సినిమాల‌కే దుకాణం సర్దేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news