Moviesదివి అందానికి స్టార్ డైరెక్టర్ ఫిదా..పవన్ సినిమాలో ఛాన్స్ ..?

దివి అందానికి స్టార్ డైరెక్టర్ ఫిదా..పవన్ సినిమాలో ఛాన్స్ ..?

దివి వద్త్యా… ఈ పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు. అంతకముందు కొన్ని షార్ట్ ఫ్లింస్ లో నటించినా రాని గుర్తింపు.. బిగ్ బాస్ తెలుగు 4 హౌజ్‌లోకి ఎంటర్ అయినా తర్వాత ఓ రేజ్ లో అభిమానులను సంపాదించుకుంది. సూపర్ పాపులర్ అయ్యింది. ఫస్ట్ ఎపిసోడ్ లోనే అందరిని ఆకర్షించిన ఈమె..తరువాత తరువాత తన దైన స్టైల్ లో గేమ్ ఆడుతూ..జనాలకు జెన్యూన్ గా అనిపించింది. కానీ, ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేకపోయింది. ఈ బిగ్ బాస్ బ్యూటీ మహర్షితో పాటు పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు.

అయితే, బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చాక అమ్మది ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు డైరెక్టర్స్ పిలిచి మరి అవకాశం ఇస్తున్నారు. కానీ, దివి తన భవిష్యత్తు కోసం ఆచి తూచి అడుగులు వేస్తుంది. వచ్చిన సినిమాల్లో నచ్చిన సినిమాలకే ఓకే చెప్పుతుంది. ప్రస్తుతం చిరంజీవి భోళాశంకర్‌ సినిమాలో నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి పిక్స్ వైరల్ అవుతున్నాయి.

దివి లెటేస్ట్ ఫోటో షూట్ కి పవన్ డైరెక్టర్ హారిష్ శంకర్ మైమరచిపోయారు. అమ్మడు ఫోటోలను చూసిన ఆయన తన దైన స్టైల్ లో కామెంట్ చేసాడు. . నువ్వు ట్రెడిషనల్ అండ్ వెస్ట్రన్ డ్రెస్సుల్లో అందంగా కనిపిస్తాయి. అది చాలా రేర్ క్వాలిటీ అని హరీష్ శంకర్ అభినందించాడు. దీనితో ప్రస్తుతం దివి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ డ్రెస్ లో నిజంగానే దివి అందాల దేవతల కనిపించింది. దీంతో హారిష్ శంకర్ పవన్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తాడు ఏమో..ఆల్ ది బెస్ట్ దివి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి హరిస్గ్ శంకర్ పొగడ్తల వరకేనా..లేక అవకాశాలు ఇచ్చేది ఉందా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news