Movies' రామారావు ఆన్ డ్యూటీ ' కొత్త ట్రైల‌ర్‌.. ర‌వితేజ ర‌చ్చ...

‘ రామారావు ఆన్ డ్యూటీ ‘ కొత్త ట్రైల‌ర్‌.. ర‌వితేజ ర‌చ్చ రంబోలా ( వీడియో)

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ఈ యేడాది ఖిలాడి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఖిలాడి సినిమా అంచ‌నాలు అందుకోలేదు. చాలా త‌క్కువ టైంలోనే ర‌వితేజ మ‌రోసారి రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ నెల 29న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోన్న ఈ సినిమా ప్ర‌మోష‌న్లు స్పీడ్‌గా న‌డుస్తున్నాయి. కొత్త ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండ‌వ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు.

ఇప్ప‌టికే వ‌చ్చిన టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో పాటు సీసా సాంగ్ మాస్‌ను ఊపేస్తోంది. ఖ‌చ్చితంగా సినిమాకు మంచి హైప్ అయితే వ‌చ్చింది. తాజాగా మ‌రో రోజులో సినిమా విడుద‌ల‌వుతుండ‌గా సినిమా యూనిట్ రామారావు ఆన్ డ్యూటీ మాస్ నోటీస్ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో అదిరిపోయింది. 1.03 సెక‌న్ల పాటు ఉన్న వీడియో చూస్తుంటే యాక్ష‌న్ క‌ట్స్ అదిరిపోయాయి.

భ‌యంక‌ర‌మైన యాక్ష‌న్‌, సెంటిమెంట్‌ను జోడించి ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో దివాన్ష కౌశిక్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సీనియ‌ర్ న‌టుడు వేణు పోలీస్ ఆఫీస‌ర్‌గా 9 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ తెర‌పై ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక మీరు కూడా ఈ మాస్ నోటీస్ వీడియోపై ఓ లుక్కేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news