Moviesస‌మంత ఎంత కెలికినా చైతు మాత్రం అదిరిపోయే ఆన్స‌ర్ ఇచ్చాడుగా...!

స‌మంత ఎంత కెలికినా చైతు మాత్రం అదిరిపోయే ఆన్స‌ర్ ఇచ్చాడుగా…!

విడాకుల త‌ర్వాత స‌మంత ప‌దే ప‌దే ప‌రోక్షంగానో లేదా ప్ర‌త్య‌క్షంగానో నాగ‌చైత‌న్య‌ను ఏదో ఒక మాట‌ల‌తో కెలుకుతూనే వ‌స్తోంది. చైతుతో పాటు అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వ‌స్తోన్న వాతావ‌ర‌ణ‌మే ఉంది. స‌రే ఇప్పుడు కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో కూడా స‌మంత చైతు పేరు ప్ర‌స్తావించేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని అర్థ‌మైంది. భ‌ర్త అంటే మాజీ భ‌ర్త అని ఘాటుగా చెప్పింది. ఇద్ద‌రూ ఒకే రూమ్‌లో ఉండాల్సిన ప‌రిస్థితి వ‌స్తే అక్క‌డ ప‌దునైన ఆయుధాలు లేకుండా చూడాల‌ని ఆమె చెప్పిన ఆన్స‌ర్‌ను బ‌ట్టి చూస్తే ఆమె చైతు మీద చంపేంత కోపంతో ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.

 

వాస్త‌వానికి స‌మంత మ‌న‌స్త‌త్వం ఏంటో నాగార్జున‌కు ముందే తెలుసు. చైతు ఆమె ప్రేమ మైకంలో ప‌డి ఆమెనే పెళ్లి చేసుకుంటాన‌ని అన్న‌ప్పుడు నాగార్జున కూడా ఆమె మ‌న‌స్తత్వం ఎలా ఉంటుందో ఫుల్‌గా ఎంక్వైరీ చేశాడ‌ట‌. నాగార్జున‌కు ఇండ‌స్ట్రీలో అంద‌రితోనూ ప‌రిచ‌యాలు ఉంటాయి. అందుకే ఆమె గురించి పూర్తిగా విచార‌ణ చేశాక ఒప్పుకోలేదు. ఆమె నీకు స‌రిప‌డ‌దు.. అని కొడుకు చైతుకు న‌చ్చ చెప్పాడు. అయితే చైతు విన‌లేద‌ట‌… ఆమెనే పెళ్లి చేసుకుంటాన‌ని ప‌ట్టుబ‌ట్టాడు.

చివ‌ర‌కు స‌మంత చెప్పిన‌ట్టే క్రిస్టియ‌న్ ప‌ద్ధ‌తిలో పెళ్లి.. ఆ త‌ర్వాత మ‌రోసారి హిందూ సంప్ర‌దాయంలో మ‌రోసారి పెళ్లి. నాగార్జున అమ‌ల‌లా ఫ్యామిలీ లైఫ్‌లో స‌ర్దుకుపోతుంద‌ని నాగ్ అనుకున్నాడు. అమ‌ల పెళ్లికి ముందు గ్లామ‌ర్ హీరోయిన్‌. అయితే పెళ్ల‌య్యాక అక్కినేని ఫ్యామిలీ సంప్ర‌దాయాల్లో విడిపోయింది. స‌మంత అలా కాదు. ఆమె స‌ర్కిల్ వేరు.. ఆమె అక్కినేని ఫ్యామిలీలో మౌల్డ్ కాలేదు.

ఆమె ఓ స్వేచ్ఛా ప‌క్షి. అక్కినేని కుటుంబంలో ఆ సంప్ర‌దాయాలు, క‌ట్టుబాట్ల మ‌ధ్య నాలుగు గోడ‌ల మ‌ధ్య ఆమె పంజ‌రంలో ఉన్న‌ట్టుగా ఫీల్ అయ్యింది. అంత పెద్ద కుటుంబంలోకి వెళ్లిన‌ప్పుడు.. పెళ్ల‌య్యాక కూడా ఆమె చెప్పిన‌ట్టుగా బ‌త‌కాలంటే కుద‌ర‌దు. పెళ్ల‌య్యాక కూడా త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా బోల్డ్‌గా న‌టిస్తాను అన‌డంతో చైతుకు ఎక్క‌డో న‌చ్చ‌లేదు. కొన్నిసార్లు రాజీప‌డ్డా… కుటుంబ స‌భ్యుల ఒత్తిడితో ఆగ‌లేక‌పోయాడు.. ప్ర‌శ్నించాడు.. చివ‌ర‌కు ఇద్ద‌రూ ఎన్నోసార్లు గొడ‌వ ప‌డ్డాడు… ఫ‌లితంగా స‌ర్దుకుపోలేమ‌ని గ్ర‌హించి విడిపోయారు.

అక్కినేని, ద‌గ్గుబాటి, నంద‌మూరి ఫ్యామిలీల్లో చాలా వ‌ర‌కు సంప్ర‌దాయాలు, క‌ట్టుబాట్లు ఉంటాయి. కానీ తాను ఫ్రీ బర్డ్‌ను అనుకున్న స‌మంత‌కు అవేమి న‌చ్చ‌లేదు. స‌రే విడిపోయాక చైతు కాని.. అక్కినేని ఫ్యామిలీ కానీ స‌మంత‌ను ఏ మాత్రం అన‌లేదు. అయితే స‌మంత ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అక్క‌సు వ్య‌క్తం చేస్తున్న‌ట్టుగా ఉంది. క‌ర‌ణ్ షోలో కూడా ఆమె మ‌రింత ద్వేషంతో మాట్లాడిన‌ట్టుగా ఉంద‌న్న చ‌ర్చ‌లు నెటిజ‌న్ల‌లో జ‌రుగుతున్నాయి.

అయితే స‌మంత ఎంత ఎగురుతున్నా… స్వేచ్ఛా ప‌తంగిలా ఉన్నా కూడా చైతు మాత్రం చాలా కూల్‌గా సైలెంట్‌గా త‌న ప‌ని తాను చేసుకుపోతున్నాడు. ఇదే ఎగిరిపోతోన్న స‌మంత‌కు చైతు ఇచ్చిన సూప‌ర్ ఆన్స‌ర్ అని నెటిజ‌న్లు కూడా చైతును కూల్‌నెస్‌ను మెచ్చుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news