Moviesఎన్ని క‌ష్టాలు వ‌చ్చిన నీ ప్రేమ‌తో జ‌యిస్తా... క‌ళ్యాణ్‌దేవ్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌..!

ఎన్ని క‌ష్టాలు వ‌చ్చిన నీ ప్రేమ‌తో జ‌యిస్తా… క‌ళ్యాణ్‌దేవ్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌..!

మెగాస్టార్ చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్‌దేవ్ .. త‌న భార్య శ్రీజ క‌లిసి ఉంటున్నారా ? లేదా ? విడిపోయారా ? అన్న‌ది మాత్రం అర్థం కావ‌డం లేదు. ఒక్క‌టిమాత్రం నిజం.. వీరు అయితే విడివిడిగానే ఉంటున్నారు. ఒక‌రి సోయ మ‌రొక‌రికి ఉన్న‌ట్టుగా అనిపించ‌డం లేదు. ఎవ‌రి దారుల్లో వారు ప‌య‌నిస్తున్న‌ట్టుగానే ఉంది. విడాకులు అధికారికంగా రాక‌పోయినా మ‌న‌సులు, దారులు అయితే వేరు అయిపోయాయ‌నే అంటున్నారు. క‌ళ్యాణ్‌దేవ్ ఫ‌స్ట్ సినిమా విజేత‌ను మెగా ఫ్యామిలీ, మెగాభిమానులు ఎలా భుజాన‌కెత్తుకున్నారో చూశాం. ఆయ‌న రెండో సినిమా సంక్రాంతికి వ‌చ్చిన సూప‌ర్ మ‌చ్చి అడ్ర‌స్ లేకుండా పోయింది.

అస‌లు ఆ సినిమా వంక చూసేందుకే మెగా ఫ్యామిలీ, మెగా హీరోలు ఎవ్వ‌రూ ఆస‌క్తి చూప‌లేదు. వీరిద్ద‌రు మాన‌సికంగా విడిపోయార‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో వీరు ఏ పోస్టులు పెట్టినా కూడా ఆస‌క్తిక‌రంగానే ఉంటోంది. శ్రీజ ఎప్పుడో యేడాది క్రిత‌మే త‌న సోష‌ల్ మీడియా ఖాతాల నుంచి క‌ళ్యాణ్‌దేవ్ ఉన్న ఫొటోల‌ను తొల‌గించేసింది. ఇక క‌ళ్యాణ్‌దేవ్ మూడో సినిమా కిన్నెర‌సాని ఓటీటీలో రిలీజ్ అయ్యింది.

తాజాగా క‌ళ్యాణ్‌దేవ్ ఎమోష‌న‌ల్‌గా పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. త‌న త‌ల్లి బ‌ర్త్ డే సంద‌ర్భంగా క‌ళ్యాణ్‌దేవ్ జీవితం ఒక్కోసారి ఎంతో క‌ష్ట‌త‌రంగా మారుతోంది. కానీ ప్రేమ‌వ‌ల్ల వ‌చ్చే శ‌క్తితో వాటిని ఎదుర్కొంటార‌న్న న‌మ్మ‌కం కుదిరింది. నాకు ఎల్ల‌ప్పుడూ నీ స‌పోర్ట్ ఉన్నందుకు థ్యాంక్యు మా అంటూ క‌ళ్యాణ్ త‌న త‌ల్లిమీద ఉన్న అపార‌మైన ప్రేమ‌ను చాటుకున్నాడు.

ఇక ఇటీవ‌ల శ్రీజ కుమార్తె బ‌ర్త్ డే సంద‌ర్భంగా కూడా క‌ళ్యాణ్‌దేవ్ స్పందించ‌లేదు. అయితే గ‌త యేడాది శ్రీజ కుమార్తె నివృతి పుట్టిన రోజు అప్పుడు మాత్రం క‌ళ్యాణ్ స్పెష‌ల్ పోస్టుతో ఆమెకు బ‌ర్త్ డే విషెష్ చెప్పాడు. అయితే ఈ యేడాది మాత్రం స్పందించ‌లేదు. ఏదేమైనా వీరిద్ద‌రి అధికారిక విడాకుల ప్ర‌క‌ట‌న మ‌రెంతో దూరంలో లేద‌న్న‌ట్టుగానే వాతావ‌ర‌ణం ఉంది.

 

 

View this post on Instagram

 

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news