Moviesహవ్వా: 50+ లో ఇలాంటి పనులా..సుస్మితాసేన్ తో లలిత్ మోడీ రొమాన్స్..!

హవ్వా: 50+ లో ఇలాంటి పనులా..సుస్మితాసేన్ తో లలిత్ మోడీ రొమాన్స్..!

ఈ మధ్య కాలంలో డేటింగ్ అన్న పదం ఎక్కువుగా వినిపిస్తుంది. లవ్ అంటూ మొదలు పెట్టి..దానికి డేటింగ్ అంటూ కొత్త పేరు పెట్టి.. భార్య భర్తలు చేసే అన్ని పనులు చేసేసి.. ఆ తరువాత నచ్చితే పెళ్లి చేసుకుంటారు. ఒక్క వేళ్ల నచ్చకపోతే..ఏముంది.. మరో అమ్మాయితో..అబ్బాయి, అబ్బాయితో అమ్మాయి..మళ్ళీ డేటింగ్ అంటూ మ్యాటర్ ఫినిష్ చేస్తారు. అలా ఉంది ప్రస్తుతం జనరేషన్ . యువత నే కాదు..50 దాటిన వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా డేటింగ్ చేస్తున్నారు.

సినీ ప‌రిశ్ర‌మలో ఇలాంటివి కామన్ నే అయినా.. ఈ వయసులో ఏం చేస్తారు రా బాబు అంటూ అడిగే నెటిజన్స్ లేకపోనూలేదు.రీసెంట్ గా తమ బంధం పై అఫిషీయల్ ప్రకటన చేశారు బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌,, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ. ఈ మేరకు ఆమెతో క్లోజ్ గా వున్న ఫోటోలను ఆయన పోస్ట్ చేస్తూ..” మీ అందరి క్లారిటీ కోసం చెప్పుతున్నా..మేము పెళ్ళి చేసుకోలేదు..కేవలం డేటింగ్ లో ఉన్నాం. పెళ్లి కూడా చేసుకుంటాం.” అంటూ రాసుకొచ్చారు. దీంతో నెటిజన్స్ హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వయసుల్లో కష్టపడుతున్నవా అంకుల్..అంటూ కొందరు.. ముసలోడికి దసరా పండుగా..అంటే ఇదే అని మరికొందరు..అబ్బో..మంచి ఫిగర్ నే పట్టావు సార్ అంటూ ఇంకొందరు ఇలా కామెంట్స్ తో పరువుతీస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన అందాల తార సుస్మితా సేన్.. 1994లో భారతదేశానికి మొట్టమొదటి యూనివర్స్ కిరీటాన్ని అందించి ఘనత సాధించిన హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది సుస్మితాసేన్. వీరిద్దరూ క్లోజ్‌గా వున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. సుస్మితా సేన్‌ గతంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ తో ప్రేమలో పడి..కొన్నాళ్లకు విడిపోయిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news