Moviesవావ్ క‌ళ్లు చెదిరే యాక్ష‌న్‌, గూస్‌బంప్స్ డైలాగ్స్‌... బింబిసార 2 ట్రైల‌ర్...

వావ్ క‌ళ్లు చెదిరే యాక్ష‌న్‌, గూస్‌బంప్స్ డైలాగ్స్‌… బింబిసార 2 ట్రైల‌ర్ ( వీడియో)

నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తోన్న సినిమా బింబిసార‌. మ‌గ‌ధ సామ్రాజ్యంలో రాజుగా ఉన్న బింబిసారుడి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోంది. కేథ‌రిన్ థెస్రా, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా ఈ సినిమా తెర‌కెక్కింది. ఇండియ‌న్ సినిమాల్లో త‌క్కువ మంది ట‌చ్ చేసిన టైం ట్రావెల్ , హిస్టారిక‌ల్ నేప‌థ్యాన్ని మిక్స్ చేసి మ‌రీ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

గ‌త ప‌ది రోజులుగా ఈ సినిమా ప్ర‌మోష‌న్లు జోరుగా న‌డుస్తున్నాయి. సినిమాపై మ‌రింత హైప్ వ‌చ్చేలా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌ను కూడా ఇన్వైట్ చేశారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, ట్రైల‌ర్లు టాప్ లేపుతున్నాయి. ఆగ‌స్టు 5న ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. అదే రోజు సీతారామం సినిమా కూడా పోటీలో ఉంది.

ఇక ఈ రోజు సినిమాకు మ‌రింత హైప్ తెచ్చేందుకు మేక‌ర్స్ ఈ రోజు ఎన్టీఆర్‌తో రెండో ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయించారు. నిమిషం పాటు ఉన్న ట్రైలర్లో అంతా భారీత‌న‌మే క‌నిపించింది. ట్రైల‌ర్లో హ‌ద్దుల‌ను చెరిపేస్తూ మ‌న రాజ్య‌పు స‌రిహ‌ద్దులు ఆ పై రాజ్యాల స‌రిహ‌ద్దులు దాటి విస్త‌రించాలి అంటూ బింబిసారుడి పాత్ర‌లో క‌ళ్యాణ్ క‌ఠినంగా డైలాగ్ చెప్పాడు.

అలాగే శ‌ర‌ణుకోరితే ప్రాణ‌భిక్ష.. ఎదిరిస్తే మ‌ర‌ణం.. ఈ క‌ల‌ల సామ్రాజ్యం సాధించే బింబిసారుడు వ‌స్తున్నాడు చూడు అన్న డైలాగ్ చెప్ప‌గా.. చివ‌ర్లో జ‌గ‌త్ జ‌జ్జ‌రిక అని గ‌ర్జిస్తూ చెప్పాడు. ఏదేమైనా సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news