Moviesనాగ‌చైత‌న్య - స‌మంత మ‌ధ్య ఇంత ప‌గ ఉందా... షాకింగ్ రీజ‌న్‌...!

నాగ‌చైత‌న్య – స‌మంత మ‌ధ్య ఇంత ప‌గ ఉందా… షాకింగ్ రీజ‌న్‌…!

టాలీవుడ్ స్టార్ క‌పుల్స్ స‌మంత – నాగ‌చైత‌న్య జంట విడిపోయి ఎవ‌రిదారిలో వాళ్లు బ‌తుకుతున్నారు. ఎవ‌రి సినిమాలు వాళ్లు చేసుకుంటున్నారు. అయితే మీడియా మాత్రం వీరిద్ద‌ర‌ని ఒదిలి పెట్ట‌డం లేదు. ఎంతో అన్యోన్యంగా ఉన్న వాళ్లిద్ద‌రు ఎందుకు విడిపోయారో తెలియ‌డం లేదంటూ మీడియా ఏదో ఒక వార్త అల్లుతూనే వ‌స్తోంది. అయితే వారిద్ద‌రు ఎంతో అన్యోన్యంగా ఉన్నార‌ని… అక్కినేని ఫ్యామిలీ కండీషన్ల‌తోనే విడిపోయారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం అయితే జ‌రిగింది.

విడిపోవ‌డానికి నాలుగైదు నెల‌ల ముందు వ‌ర‌కు కూడా వారు చాలా ప్రేమ‌తో ఉన్నార‌నే అంద‌రూ అనుకున్నారు. అయితే వారి మ‌ధ్య పెళ్లి త‌ర్వాత ఆ స‌ఖ్య‌త కొద్ది రోజులు మాత్ర‌మే ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ నిజం స‌మంత త‌న తాజా కాపీ విత్ క‌ర‌ణ్ షోలో చెప్పిన మాట‌లే స్ప‌ష్టం చేస్తున్నాయి. స‌మంత మాట‌ల్లో చూస్తే మా ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం లేదు.. ఒక వేళ మా ఇద్ద‌రిని ఒకే గ‌దిలో ఉంచినా అక్క‌డ ప‌దునైన ఆయుధాలు, వ‌స్తువులు లేకుండా చూసుకోవాల‌ని చెప్పింది.

ఈ మాట‌లు ఆమె ఏదో స‌ర‌దాకు అయితే మాత్రం అన‌లేదు. అంటే ఒక‌రిని మ‌రొక‌రు ప‌దునైన ఆయుధాలు దొరికితే చంపేసుకునేంత కోపంతో స‌మంత ఉందా ? లేదా ? ఇద్ద‌రు ఉన్నారా ? అన్న‌ది అర్థ‌మ‌వుతోంది. స‌మంత మాట‌ల‌ను బ‌ట్టే నాగ‌చైత‌న్య‌పై స‌మంత ఆగ్ర‌హం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. పొర‌పాటున యాంక‌ర్ మీ భ‌ర్త ? అంటే వెంట‌నే స‌మంత మాజీ భ‌ర్త అని సీరియ‌స్‌గా చెప్పింది.

అస‌లు చైతును త‌న భ‌ర్త‌గా పొర‌పాటుగా చెప్పేందుకు కూడా ఆమె ఇష్ట‌ప‌డ‌డం లేదు. స‌మంత కోపం పీక‌ల్లోతు స్థాయిలో ఉంద‌ని క్లారిటీగా తెలుస్తోంది. మ‌రి అంత శ‌త్రుత్వం వీరి మ‌ధ్య ఎందుకు ఏర్ప‌డింది ? ఇందుకు నాగ‌చైత‌న్యే కార‌ణ‌మా ? లేదా ? త‌న కుటుంబం త‌న‌పై తీసుకువ‌చ్చిన ఒత్తిడితో స‌మంత‌ను ఇబ్బంది పెట్టాడా ? లేదా ? త‌ప్పు స‌మంత వైపు నుంచే ఉందా ? అన్న‌ది వాళ్ల‌కే తెలియాల‌ని ఇండ‌స్ట్రీలో చ‌ర్చ జ‌రుగుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news