Moviesసుమ‌న్‌ను బ్లూ ఫిల్మ్ కేసులో ఇరికించించారా.. ఆ అమ్మాయి ఎవ‌రు... కుట్ర...

సుమ‌న్‌ను బ్లూ ఫిల్మ్ కేసులో ఇరికించించారా.. ఆ అమ్మాయి ఎవ‌రు… కుట్ర వెన‌క సినీ పెద్ద‌లు…!

టాలీవుడ్ న‌టుడు సుమ‌న్‌పై అప్ప‌ట్లో బ్లూ ఫిల్మ్ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో గుంఢా యాక్ట్ పెట్ట‌డం ఇండ‌స్ట్రీని ఊపేసింది. ఈ ఇష్యూ జ‌రిగే టైంలో సుమ‌న్ టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఉన్నాడు. అప్పుడు స్టార్ హీరోలుగా చెప్పుకునే వాళ్ల‌ను మించిన సూప‌ర్ హిట్లు సుమ‌న్‌కు వ‌చ్చాయి. ఈ ఇష్యూలో సుమ‌న్‌ను కుట్ర చేసి ఇరికించారంటూ అప్ప‌ట్లో ఓ స్టార్ హీరో పేరు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను బ‌ల‌ప‌రిచే సాక్ష్యాలు ఏవి బ‌య‌ట‌కు రాలేదు. దీంతో అవి రూమ‌ర్స్‌గానే మిగిలిపోయాయి.

అయితే సుమ‌న్ ఈ కేసులో కొద్ది రోజులు జైలులో ఉండాల్సి వ‌చ్చింది. సుమ‌న్ జైలుకు వెళ్లే ముందు అస‌లు పెద్ద హీరోలే అత‌డి సినిమాలు వ‌స్తున్నాయంటే భ‌య‌ప‌డే వాళ్లు. అలాంటి టైంలో సుమ‌న్ జైలు నుంచి వ‌చ్చాక కొన్నాళ్లు సినిమాల‌కు దూరంగా ఉన్నాడు. ఆ త‌ర్వాత చిన్న చిన్న పాత్ర‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. అది కూడా త‌మిళ్‌లోనే ఎక్కువ సినిమాలు చేశాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ నెమ్మ‌దిగా సుమ‌న్ తెలుగు సినిమాల్లోకి వ‌చ్చాడు.

సుమ‌న్‌ను తెలుగులోకి తీసుకువ‌చ్చింది అత‌డి ఫ్రెండ్ భానుచంద‌ర్‌. సుమ‌న్ మార్ష‌ల్ ఆర్ట్స్‌లో ఉన్న నైపుణ్యం వ‌ల్లే సుమ‌న్‌ను అసాధార‌ణ హీరోను చేసింది. ఆ ప్ర‌త్యేక‌తే అత‌డంటే కొంద‌రు హీరోలు కుళ్లుకోవ‌డానికి కార‌ణ‌మైంది. అయితే సుమ‌న్ కేసులో ఓ హై ప్రొఫైల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి పేరు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే అప్ప‌ట్లో సుమ‌న్ ఇదో ప్రైవేట్ ఫ్యామిలీ ఎఫైర్ అని తమిళ మీడియాకి చెప్పారు.

ఆ స‌మ‌యంలో సుమ‌న్‌తో ఎవ‌రు స‌న్నిహితంగా ఉన్నా… సుమ‌న్‌కు ఎవ‌రు ఫోన్ చేసినా కూడా పోలీసులు వాళ్ల‌ను కూడా ప్ర‌శ్నించేవార‌ట‌. అందుకే త‌న‌కు ఎంతో బెస్ట్ ఫ్రెండ్ అయిన భానుచంద‌ర్‌కు రెండు నెల‌ల పాటు త‌న‌కు క‌నీసం ఫోన్ కూడా చేయ‌వ‌ద్ద‌ని చెప్పాడ‌ట సుమ‌న్‌. ఒక‌వేళ తాను ఫోన్ చేసి ఉంటే పోలీసులు త‌న‌ను కూడా అనుమానించేవార‌ని.. ఈ విష‌యంలో సుమ‌న్ త‌న‌ను సేవ్ చేశాడంటూ భానుచంద‌ర్ స్వ‌యంగా ఎన్నోసార్లు చెప్పారు. ఏదేమైనా ఈ ఇష్యూలో సుమ‌న్ ఏ త‌ప్పు చేయ‌లేదు. కానీ జెట్ రాకెట్ స్పీడ్‌తో వెళుతోన్న ఆయ‌న కెరీర్ మాత్రం దెబ్బ‌తింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news